CM Chandrababu: మదనపల్లె ఆర్డీవో ఆఫీస్ లో అగ్నిప్రమాదంపై (Madanapalle RDO Fire accident) ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఫైల్స్ ను ఉద్దేశపూర్వకంగా తగులబెట్టారని..అసైన్డ్ ల్యాండ్స్ కి సంబంధించిన ఫైల్స్ అన్నింటిని దగ్థం చేశారని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. కొద్దిరోజుల క్రితం మైన్స్ శాఖకు సంబంధించిన ఫైల్స్ ను కరకట్టమీద తగులబెట్టారని.. ఎన్నికల రిజల్ట్ కు ముందు సీఐడీ కార్యాలయంలో ఫైల్స్ దగ్థం చేశారన్నారు. అందుకే మదనపల్లి ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్నామన్నారు.
అవినీతి బయటకు రాకుండా ఉండాలని కావాలనే ఫైల్స్ అన్నింటికి నిప్పు పెట్టారన్నారు. అందుకే లోతుగా విచారణ జరిపి అసలు నిందితులు ఎవరో, ఆ ఫైల్స్ లో ఏం ఉందో తేల్చాలని ఆదేశించానన్నారు. నేరగాళ్లకు, తప్పులు చేసేవాళ్లకు అసెంబ్లీ సాక్షిగా వార్నింగ్ ఇస్తున్నానన్నారు సీఎం చంద్రబాబు. రాజకీయ ముసుగులో నేరాలు చేస్తానంటే ఉపేక్షించేది లేదన్నారు. ఇన్నాాళ్లు ఎన్ని తప్పులు చేసినా.. చెల్లుబడి అయిందని..ఇకపై చెల్లదని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో హెచ్చరించారు.
Also Read: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?