Chandrababu Naidu Arrest: తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత చంద్రబాబు నాయుడి(Chandrababu Naidu)ని సిట్ కార్యాలయాని(CIT Office)కి తీసుకొచ్చారు సీఐడీ అధికారులు. చంద్రబాబును విచారించేందుకు సీఐడీ(CID) అధికారులు 20 ప్రశ్నలతో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబును సీట్ కార్యాలయానికి తీసుకువచ్చిన అధికారులు.. కాసేపు ఆయనకు విశ్రాంతి ఇచ్చారు. కొద్దిసేపటి క్రితమే ఆయన విచారణ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కాగా, చంద్రబాబును సిట్ 20 ప్రశ్నలు అడగనుందని సమాచారం. ప్రధానంగా రాష్ట్ర మంత్రివర్గం అనుమతి లేకుండానే ఎందుకు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారంటూ ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే, గంటా సుబ్బారావుకు పదవులు, వాటి ప్రాతిపదిక, సీమెన్స్ ఒక్క రూపాయైనా ఖర్చు చేయకుండా ప్రభుత్వం ఎలా రూ. 371 కోట్లు రిలీజ్ చేసింది? వంటి ప్రశ్నలతో సిట్ విచారణకు సిద్ధంగా ఉందని సమాచారం.
కాగా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నంద్యాల పోలీసులు శనివారం తెల్లవారుజామున అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నంద్యాల రేంజ్ డీఐజీ రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఇవాళ ఉదయం చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. అయితే, చంద్రబాబును అరెస్ట్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, నిసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇక ఇవాళ ఉదయం చంద్రబాబును అరెస్ట్ చేసిన పోలీసులు.. వివిధ మార్గా్ల్లో తిప్పుకుంటూ తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు. కాసేపు సిట్ కార్యాలయంలో చంద్రబాబును విచారించనున్నారు అధికారులు. అనంతరం జీజీహెచ్‌లో వైద్య పరీక్‌షలు నిర్వహించి కోర్టు ముందు హాజరుపరుస్తారు. టీడీపీ శ్రేణుల ఆందోళనల నేపథ్యంలో ప్రస్తుతం సిట్ కార్యాలయ రహదారులను పోలీసులు దిగ్బంధించారు. సిట్ నుంచి కోర్టుకు వెళ్లే మార్గాన్ని సైతం తమ అధీనంలోకి తీసుకున్నారు. మరి కోర్టు తీర్పు ఎలా ఉంటుందనే దానిపై ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
టీడీపీ నేతలకు గవర్నర్ అపాయింట్‌మెంట్..
చంద్రబాబు నాయుడి అరెస్ట్ నేపథ్యంలో.. ఇవాళ సాయంత్రం 7.15 గంటలకు టీడీపీ నేతలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు రాష్ట్ర గవర్నర్ నజీర్. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా ఇతర నేతలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు గవర్నర్. ప్రస్తుతం విశాఖ పోర్టు గెస్ట్ హౌస్‌లో ఉన్నారు. గవర్నర్. మరోవైపు పోలీసుల నిర్బంధంలో ఉన్న టీడీపీ నేతలు గవర్నర్‌ను కలుస్తారా? లేదా అనే ఉత్కంఠ టీడీపీ వర్గాల్లో నెలకొంది.
చంద్రబాబు తరఫున వాదించనున్న లాయర్ ఫీజు ఎంతో తెలుసా?
Also Read:
G20 Summit: ప్రపంచ జీవ ఇంధన కూటమిని ప్రకటించిన భారత్
Pawankalyan: బేగంపేటలో పవన్ కల్యాణ్ విమానానికి అనుమతి నిరాకరణ