Supreme Court Reacts on Chandrababu Petition: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు(Supreme Court) నిరాకరించింది. ఈ పిటిషన్‌ను మంగళవారం మరోసారి మెన్షన్ చేయాలని సూచించారు సీజేఐ చంద్రచూడ్. చంద్రబాబుపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలంటూ ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. చంద్రబాబు కస్టడీలో ఉన్నారని, అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. పిటిషన్‌ను సుప్రీంకోర్టులో మెన్షన్ చేశారు లూథ్రా. అయితే, ఈ పిటిషన్‌ను మంగళవారం మరోసారి మెన్షన్ చేయాలంటూ సూచించారు ప్రధాన న్యాయమూర్తి. కాగా, క్వాష్ పిటిషన్‌పై విచారణ కోసం చంద్రబాబు తరఫున న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా హాజరవగా.. ఏపీ ప్రభుత్వం తరఫున హైకోర్టులో వాదించిన ముకుల్ రోహత్గీ, సీఐడీ తరఫున వాదించిన రంజిత్ కుమార్‌లుఉ కూడా సుప్రీంకోర్టుకు హాజరయ్యారు.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ..
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ చంద్రబాబు మొదట హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా హైకోర్టులో తన వాదనలు వినిపించారు. హైకోర్టులో ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ తన వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలను విన్న హైకోర్టు ధర్మాసనం.. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది. సీఐడీ తరఫు న్యాయవాదుల వాదనతో కోర్టు ఏకీభవించింది. హైకోర్టులో తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Also Read:
Hyderabad: భాగ్యనగరం సిగలో మరో 5 ఫ్లైవర్స్.. నేడే శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్..