KCR: కేసీఆర్ ఆరోగ్య స్థితిపై చంద్రబాబు, పవన్ ఏం అన్నారంటే? కేసీఆర్ త్వరగా కోలుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆకాంక్షిస్తున్నారు. కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ పేర్కొన్నారు. లోకేష్ సైతం సోషల్ మీడియాలో స్పందించారు. కేసీఆర్ కోలుకొని ప్రజలకు సేవ చేస్తారని ఆకాంక్షించారు. By Jyoshna Sappogula 08 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Chandrababu: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తుంటి ఎముక విరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన యశోద ఆసుపత్రిలో ఉన్నారు. మరోవైపు ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. కేసీఆర్ గాయపడటంపై టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. Concerned to learn that KCR Garu has sustained an injury. I pray for his complete and swift recovery. — N Chandrababu Naidu (@ncbn) December 8, 2023 కేసీఆర్ గాయపడ్డారనే వార్త విని ఆందోళనకు గురయ్యానని చంద్రబాబు తెలిపారు. త్వరగా, సంపూర్ణంగా ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. గాయం నుంచి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. Wishing KCR Garu a full and speedy recovery from his injury. — Lokesh Nara (@naralokesh) December 8, 2023 బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జారిపడి గాయమైందని తెలిసి బాధపడ్డానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కేసీఆర్ త్వరగా... సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. అనారోగ్య పరిస్థితులను మనోధైర్యంతో కేసీఆర్ అధిగమించాలన్నారు. కేసీఆర్ కోలుకొని ప్రజలకు సేవ చేస్తారని ఆకాంక్షించారు. Also Read: కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ ట్విట్.! శ్రీ కేసీఆర్ గారు సంపూర్ణంగా కోలుకోవాలి - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/59kXk83p3V — JanaSena Party (@JanaSenaParty) December 8, 2023 కాగా, మాజీ సీఎం కేసీఆర్ అర్ధరాత్రి కాలుజారి కిందపడిన విషయం తెలిసిందే. కేసీఆర్ ఎడమ కాలు తుంటి ఎముక మార్పిడి చేయాలని డాక్టర్లు తెలిపారు. ఆయన కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుందన్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. #kcr #lokesh #chandrababu #pawan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి