Chandrababu: ఇక ఎన్నికలకు ఒక్కరోజే సమయం ఉంది. నిన్నటితో ప్రచారం ముగిసింది. ప్రచారం ముగిసిన తరువాత నేతలు సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. ఏపీలో సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు, ట్వీట్ లు హోరెత్తుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజల నుద్దేశించి బహిరంగ లేఖ రాశారు. అంతేకాకుండా X వేదికగా ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఎన్నికల పోలింగ్ తేదీ మే13 తప్పనిసరిగా అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా.. ఈ ఏపీ దశ, దిశను మార్చే ఎన్నికలుగా వీటిని అభివర్ణించారు. అందుకే, పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఏపీ ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి సొంతూళ్లకు తరలి రావాలని ఆయన కోరారు. చంద్రబాబు ట్వీట్ ఇక్కడ చూడొచ్చు..
Chandrababu: ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచార సమయం ముగిసిన వెంటనే ఏపీ ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలి అంటూ పేర్కొన్నారు. ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రజల భవితవ్యానికి అత్యంత కీలకమని ఆయన అన్నారు. 2014లో రాష్ట్రం విడిపోయిన సమయంలో అనేక కష్టనష్టాలతో టీడీపీ పాలన సాగించిందని.. రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నిలపడానికి ప్రయత్నించామని.. అయితే, 2019లో తాము గెలిచి ఉంటే దేశంలోనే మొదటి స్థానంలో ఏపీని నిలబెట్టి ఉండేవారమనీ ఆయన వివరించారు.
Also Read: బన్నీకి బిగ్ షాక్.. నంద్యాలలో కేసు నమోదు!
Chandrababu: ఆ ఎన్నికల్లో మోసపూరిత హామీలతో వైఎస్ జగన్ అధికారాన్ని చిక్కించుకున్నారనీ.. కానీ, గెలిచిన తరువాత హామీలన్నీ పక్కన పడేశారని విమర్శించారు. అధికారం చేపట్టినప్పటినుంచే జగన్ విధ్వాంసకర రాజకీయాలకు తెరతీశారని, అరాచక పాలనతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. వైసీపీ అరాచకాల నుంచి బయటపడే అవకాశం ప్రజలకు వచ్చింది అనీ.. సంక్షేమం, అభివృద్ధి అందించే సుపరిపాలన కోసం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని చంద్రబాబు నాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబు బహిరంగ లేఖ ఇక్కడ చూడొచ్చు..