Chandrababu: దీక్షకు సిద్దమైన చంద్రబాబు.. ఎప్పుడంటే.! అక్రమ అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు జైల్లో దీక్షకు దిగబోతున్నట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. By Karthik 30 Sep 2023 in విజయవాడ రాజకీయాలు New Update షేర్ చేయండి అక్రమ అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు జైల్లో దీక్షకు దిగబోతున్నట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. తనకు జరిగిన అన్యాయంపై జైల్లోనే దీక్ష చేపట్టబోతున్నట్లు ఆయన వెల్లడించారు. అదే రోజు నారా భువనేశ్వరి సైతం చంద్రబాబు దీక్షకు సంఘీభావంగా దీక్ష చేయనున్నట్లు తెలిపారు. కాగా నారా భువనేశ్వరి ఎక్కడ దీక్ష చేయబోతున్నారనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. మరోవైపు అక్టోబర్ 2న చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ ఆయన దీక్షకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో టీడీపీ నేతలు దీక్షలు చేయనున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు ఒక్కరోజు దీక్షకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అచ్చెన్నాయుడు.. సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు. ఈ నాలుగున్నర ఏళ్లలో ఏపీ 20 సంవత్సరాల వెనక్కి వెళ్లిందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పాలనను ప్రజలు గమనిస్తున్నారన్నారు. జగన్ రాష్ట్రంలో ఏం చేశారని మా ధైర్యం నివ్వే జగన్ అని ఇంటింటికి స్టిక్కర్లు వేయించుకుంటున్నారని ప్రశ్నించారు. వాలంటీర్లు ఇంటికి ఎన్ని స్టిక్కర్లు వేసినా ప్రజల హృదయాల్లో చంద్రబాబు నాయుడే ఉన్నాడని వారి హృదయాలపై ఎలాంటి స్టిక్కర్ వేయలేవని విమర్శించారు. 2019 నుంచి నేటి వరకు జగన్ చేసిన అక్రమాలు ప్రజలకు తెలుసన్నారు. ప్రజలే జగన్ మోహన్ రెడ్డి అంతు చూస్తారని ఆయన హెచ్చరించారు. #tdp #chandrababu #nara-bhuvaneshwari #deeksha #october-2 #solidarity మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి