Chandrababu Naidu: చంద్రబాబుకు అసలేమైంది?.. ఆయన ఆరోగ్యం ఎలా ఉంది?.. పూర్తి వివరాలు

ఏపీలోని స్కిల్ డెవలాప్‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తూర్పు గొదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలులోని రిమాండ్‌లో ఉన్నారు. అయితే ఇప్పుడు బాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చంద్రబాబుకు ప్రభుత్వాసుపత్రి వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకగడానే ఉందని చెబుతున్నారు.

AP Politics : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ
New Update

ఏపీలోని స్కిల్ డెవలాప్‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తూర్పు గొదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలులోని రిమాండ్‌లో ఉన్నారు. అయితే ఇప్పుడు బాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చంద్రబాబుకు ప్రభుత్వాసుపత్రి వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకగడానే ఉందని చెబుతున్నారు. మరోవైపు జైలులో చంద్రబాబుకు ప్రమాదం ఉందని లోకేష్, భువనేశ్వరీ, బ్రాహ్మిణీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవలే ఆయన డీహెడ్రేషన్‌కు గురయ్యారని ఇప్పుడు చర్మ సమస్యతో బాధపడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఆయన్ని కావాలనే ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన బరువు తగ్గిపోయారని.. ఇంకా తగ్గితే కిడ్నీలు పాడవుతాయని అంటున్నారు. అయితే శరీరానికి ఎక్కువగా చెమట పట్టడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. చంద్రబాబుకు ప్రస్తుతం ఆయన ఉంటున్న జైలులో ఏసీ లేనందువల్ల ఇలాంటి సమస్యలకు గురయ్యారని అంటున్నారు.

Also Read: చంద్రబాబు ప్రాణాలకు ముప్పు..గవర్నర్ కు ఎంపీ లేఖ..!!

అయితే చంద్రబాబు ఒంటిపై వచ్చిన దుద్దుర్లకు ఇప్పటికే వైద్యులు మెడిసన్ ఇచ్చారు. ఆయన వైద్య సేవల కోసం ప్రత్యేకంగా మూడు బృందాలను ఏర్పాటు చేశామని.. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు చెబుతున్నారు. ఆయన భద్రతకు సంబంధించి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని డీఐజీ రవికుమార్ తెలిపారు. చంద్రబాబుకు వచ్చే ఆహారం, ఇతర అంశాలను తనిఖీ చేసి అందించేందుకు ఒక జైలర్ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించామని పేర్కొన్నారు. బయట నుంచి వచ్చిన భోజనాన్ని పరీక్షించిన తర్వాతే లోపలికి పంపుతున్నామని స్పష్టం చేశారు. ఎస్పీ సలహా, సూచనలు పాటిస్తూ ఎప్పటికప్పుడు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు.

చంద్రబాబు జైల్లోకి వచ్చినప్పుడు 66 కేజీలు ఉండగా, ప్రస్తుతం ఆయన 67 కేజీల బరువుకు చేరుకున్నట్లు చెప్పారు. చంద్రబాబు బరువు తగ్గారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు. ఆయన కొంత డీహైడ్రేషన్‌కు గురై చర్మ సంబంధిత సమస్యలు తలెత్తిన మాట వాస్తవమేనని, అయితే వెంటనే డెర్మటాలజిస్టులను రప్పించి చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. తాగునీరు, భోజనం విషయంలో నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏ మందులు ఇస్తున్నారనేది డాక్టర్ కు, పేషెంట్ కు మధ్య ఉండే ప్రైవసీ అని.. చంద్రబాబు రోజూ వినియోగిస్తున్న మందులనే వాడుతున్నారన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ ఏమన్నారో ఈ కింది వీడియోలో చూడండి.

#chandrababu-naidu-arrest #chandrababu-naidu-arrest-issue
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe