Nara Lokesh: నా తండ్రిని చూసే హక్కు కూడా నాకు లేదా ? ఆ సైకో చెప్పాడా నీకు ? పోలీసుల తీరుపై టీడీపీ యువనేత నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. నంద్యాలలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబను పోలీసులు అరెస్ట్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. పొదలాడ యువగళం క్యాంప్ సైట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు వద్దకు వెళ్ళకూడదు అంటూ లోకేశ్‌ని అడ్డుకున్నారు పోలీసులు. ఎలాంటి నోటీసులు లేకుండా గంట నుంచి పోలీసుల హై డ్రామా చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు!
Also Read: ఏపీ వ్యాప్తంగా కొనసాగుతోన్న నిర్బంధాలు.. చంద్రబాబు అరెస్ట్‌తో హై డ్రామా!
ఏపీ వ్యాప్తంగా ఇదే పరిస్థితులు:
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో వివిధ జిల్లాల్లో హై అలెర్ట్ కొనసాగుతోంది. కోనసీమజిల్లాలోని ప్రధాన కూడళ్లలో పోలీసు పహారా కాస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా టీడీపీ ముఖ్య నాయకులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. రాజోలు మండలం పోదలాడలో నారాలోకేశ్ బస చేస్తున్న చోట భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడెక్కడ ఎవరిని వెళ్ళకుండా భారీ గేట్ల ఏర్పాటుచేశారు. ఉమ్మడిజిల్లాలో బస్సు సర్వీసులను రద్దు చేసింది. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కుప్పంలోనే అంతే:
చంద్రబాబు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో బస్సులు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్టాండ్‌కే బస్సులు పరిమితమయ్యాయి. బస్సులు లేక రోడ్డుపై తీవ్ర ఇబ్బందులు పడున్నారు ప్రజలు. ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకాకుండా టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ పి ఎస్. మునిరత్నం , మాజీ జెడ్పీటీసీ రాజకుమార్, మాజీ ఏఎంసీ చైర్మన్ సత్యెంద్ర శేఖర్ ఇతర ముఖ్య నేతలను అదుపులోకి తీసుకున్నారు.
టీడీపీ నేతల కదలికలపై నిఘా:
మరోవైపు గుంటూరు జిల్లాలో టీడీపీ ముఖ్య నేతల ఇళ్ల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. టీడీపీ నాయకుల కదలికలపై దృష్టి పెట్టాయి నిఘా వర్గాలు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇంటి వద్దకు ప్రజలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఇక ఇప్పటికే ఇన్‌చార్జ్ కోవెలమూడి రవీంద్ర, నసీర్ అహ్మద్‌ని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. గుంటూరు నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ALSO READ: చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వ వైద్యులు.. వీడియో..!