Chandrababu : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర డీజీపీ(DGP) కి టీడీపీ(TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) లేఖ రాశారు. రాబోయే ఎన్నికల నామినేషన్ లో పొందుపరిచేందుకు 2019 తర్వాత వివిధ జిల్లాల్లో తనపై పోలీసులు పెట్టిన కేసుల వివరాలు ఇవ్వాలని లేఖలో కోరారు.
సమాచారం ఇవ్వలేదు..
ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తమపై నమోదైన కేసుల వివరాలు నామినేషన్ సమయంలో అధికారులకు తెలియజేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. 'గత 5 ఏళ్ల కాలంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాపై పలు అక్రమ కేసులు వేయించారు. ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్న కారణంగా పోలీసు స్టేషన్లలో, వివిధ ఏజెన్సీల ద్వారా కేసులు పెట్టారు. ఇలాంటి సందర్భాల్లో సంబంధిత ఏజెన్సీలు, అధికారులు నాపై పెట్టిన కేసుల విషయంలో నాకు సమాచారం ఇవ్వలేదు. ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్న నాపై 2019 నుంచి నమోదైన కేసుల వివరాలు తెలియజేయాలని కోరుతున్నా. నామినేషన్ దాఖలు చేయడానికి ఎన్నికల అభ్యర్థులు తమపై ఎక్కడ ఏ కేసు ఉందనే వివరాలు తెలియజేయాల్సి ఉంది. ఏ క్షణలో అయినా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున ముందుగా ఈ వివరాలు తెలియజేయాలని కోరుతున్నా. వ్యక్తి గతంగా నేను ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం పొందడం అనేది ఆచరణ సాధ్యం కాదని తెలిపారు.
ఇది కూడా చదవండి: Samantha: ఐకాన్ స్టార్‌ను తెగ పొగిడేస్తున్న సామ్.. మతలబేంటో తెలుసా!
కుట్రలు చేసే అవకాశం..
అందుకే పోలీసు కార్యాలయం ద్వారా కేసుల విషయంలో సమాచారం ఇవ్వాలని కోరారు. రాష్ట్ర డీజీపీతో పాటు అన్ని జిల్లాల ఎస్పీలకు, ఏసీబీ, సీఐడీ విభాగాలకు కూడా లేఖ పంపించారు చంద్రబాబు. అక్రమ కేసులతో ప్రభుత్వం కుట్రలు చేసే అవకాశం ఉందనే అనుమానంతో ముందుగానే లేఖ రాసి వివరాలు కోరినట్లు తెలుస్తోంది. అలాగే నామినేషన్ ప్రక్రియలో వైసీపీ(YCP) అక్రమాలకు చెక్ పెట్టేలా లేఖ ద్వారా సమాచారం కోరినట్లు సమాచారం. అంతేకాదు సమాచారం లేని కేసుల విషయంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తల కోసం ఈ లేఖలు రాసినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.