కుప్పం (Kuppam) నియోజక వర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) పర్యటన శనివారంతో ముగిసింది. ఆయన పర్యటన నియోజకవర్గంలో మూడు రోజుల పాటు సాగంది. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే ఆయన శనివారం పర్యటన ముగించుకుని మల్లనూరు నుంచి బెంగళూరు బయల్దేరారు.
అక్కడి నుంచి ఆయన స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ (Hyderabad) రానున్నారు. మూడో రోజు పర్యటనలో భాగంగా ఆయన కుప్పం, మల్లనూరులో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన కుప్పంలోని అన్నా క్యాంటీన్ ను సందర్శించి భోజనం చేశారు. సాయంత్రం మల్లనూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు.
ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ (YCP) మునిగిపోయే నావ..దాన్ని ఎవరూ కాపాడలేరని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వారిలో వారికే తిరుగుబాటు మొదలైంది. అందుకే వారి ఎమ్మెల్యేలు, ఎంపీలు చెట్టుకోకరు..పుట్టకోకరు అన్నట్లు మిగిలారు. సొంత పార్టీ వారినే జగన్ ఏడిపిస్తుంటే..ఇక రాష్ట్ర ప్రజలను ఏడిపించారా అంటూ ప్రశ్నించారు.
ఇప్పుడు జగన్ పాలన పోవాలంటే ఇంటికి ఒకరు తమ భవిష్యతు కోసం జెండా పట్టుకుని బయటకు రావాలని పిలుపునిచ్చారు. అడ్డొచ్చిన వారిని ఆ జెండా పట్టుకునే బడితపూజ చేయాలని పిలుపునిచ్చారు.
Also read: జనవరి ఫస్ట్‌ని న్యూ ఇయర్‌గా ఎందుకు జరుపుకుంటున్నారు? అసలు న్యూ ఇయర్ ఆ రోజేనా?