CM Jagan : చంద్రబాబు విలన్ .. సిద్ధం సభలో రెచ్చిపోయిన సీఎం జగన్ రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు అందరూ చంద్రబాబు, దత్తపుత్రుడు రూపంలో ఇక్కడే ఉన్నారని అన్నారు సీఎం జగన్. ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరిగానే కనిపిస్తాడని.. కానీ నిజం ఏంటంటే..కోట్ల మంది హృదయాల్లో జగన్ ఉన్నాడని పేర్కొన్నారు. By V.J Reddy 03 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి CM YS Jagan v/s Chandrababu : నెల్లూరు(Nellore) దెందులూరు వైసీపీ(YCP) సిద్ధం సభ(Siddham Sabha) లో సీఎం జగన్(CM Jagan) చంద్రబాబు(Chandrababu) పై రెచ్చిపోయారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు చీల్చి చెండాడాలని అన్నారు. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా అని సభకు వచ్చిన వైసీపీ శ్రేణులను సీఎం జగన్ ప్రశ్నించారు. ఇంటింటి భవిష్యత్తును మరింత మార్చేందుకు మీరు సిద్ధమా? దుష్టచతుష్టయంపై యుద్ధానికి మీరు సిద్ధమా?, పేదల భవిష్యత్‌ను కాటేసే ఎల్లో వైరస్‌పై యుద్ధానికి మీరు సిద్ధమా? అని సభలో ప్రసంగించారు. విలన్ చంద్రబాబు.. రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు అందరూ చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు రూపంలో ఇక్కడే ఉన్నారని అన్నారు సీఎం జగన్. ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరిగానే కనిపిస్తాడని.. కానీ నిజం ఏంటంటే.. కోట్ల మంది హృదయాల్లో జగన్ ఉన్నాడని పేర్కొన్నారు. జగన్ ఒంటరివాడు కాదన్నది ఇక్కడ కనిపిస్తున్న జనమే నిజం అని అన్నారు. కోట్లాది మంది గుండెల్లో జగన్ ఉండటమే నిజం.. నాకున్న సైన్యం, బలం.. దేవుడు, ప్రజలే అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. Also Read : ‘మీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా’.. ఎమ్మెల్సీ కవితపై బండ్ల గణేష్ ఫైర్ నేను అర్జునుడిని.. వచ్చే ఎన్నికల రణక్షేత్రంలో మీరంతా కృష్ణుడైతే నేను అర్జునుడిని అని అన్నారు సీఎం జగన్. దుష్టచతుష్టయం దాడి అంతా అభివృద్ది, సంక్షేమం మీదనే.. రాబోయే తరం విద్యావిధానాల మీద దుష్టచతుష్టయం దాడి చేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై టీడీపీ(TDP) దండయాత్ర చేస్తోందిని ఫైర్ అయ్యారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ నెరవేర్చిన ప్రభుత్వం మనది అని పేర్కొన్నారు. పేదవాడి భవిష్యత్తు, సంక్షేమం మీద వారంతా దాడి చేస్తున్నారని.. గ్రామగ్రామాల్లో మనం తెచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. 175కు 175.. అవినీతి, వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందించాం అని అన్నారు సీఎం జగన్. అందించిన సంక్షేమ పాలనకు ప్రతీ పేద కుటుంబమే సాక్ష్యం అని పేర్కొన్నారు. 175కు 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యం అని పిలుపునిచ్చారు. నా మాటలన్నీ ప్రతీ ఇంటికి వెళ్లి పంచుకోవాలని సభకు వచ్చిన వైసీపీ కార్యకర్తలను కోరారు. చంద్రబాబు పాలనకు, జగన్ పాలనకు తేడాను గమనించండి అని అన్నారు. పేద కుటుంబాలకు చంద్రబాబు ఏం చేశాడో అడగండి అని కోరారు. చంద్రబాబు హయాంలో ఇచ్చిన స్కీములు ఏమున్నాయో అడగండి.. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ ఏ గ్రామానైన్నా తీసుకోండి.. గతంలో లేనిది ఇప్పుడు గ్రామాల్లో వచ్చిన మార్పును గమనించండి అని పేర్కొన్నారు. Also Read : అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్షా సరళి.. ఇలా చేస్తే ఉద్యోగం మీదే #nellore #cm-jagan #ap-latest-news #siddham-sabha #chadrababu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి