BREAKING: టెన్షన్‌ టెన్షన్.. రాంగ్‌ రూట్‌లో చంద్రబాబు హెలికాఫ్టర్‌..!

విశాఖ నుంచి అరకు సభకు వెళ్తున్న చంద్రబాబు హెలికాప్టర్‌‎లో సమన్వయ లోపం తలెత్తింది. ఏటీసీతో పైలట్‌కు సమన్వయ లోపం ఏర్పడడంతో నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరొక మార్గంలో హెలికాప్టర్‌‎ ప్రయాణించింది. కొంత సమయం తరువాత మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు ఏటీసీ అనుమతి లభించింది.

New Update
BREAKING: టెన్షన్‌ టెన్షన్.. రాంగ్‌ రూట్‌లో చంద్రబాబు హెలికాఫ్టర్‌..!

Chandrababu Helicopter: చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ అరకు నుంచి వెనక్కు వెళ్లింది. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాఫ్టర్‌లో అరకు (Araku) బయల్దేరారు చంద్రబాబు. పైలట్ - ఏటీసీ సిబ్బందికి సమన్వయం కుదరలేదు. విశాఖ ఎయిర్పోర్ట్ కు అరకు సమీపం నుంచి వెనుతిరిగింది హెలికాప్టర్. ఏటీసీ నిర్దేశించిన మార్గంలో కాకుండా. వేరే మార్గంలో వెళ్లినట్టు ఏటీసీ (ATC) గుర్తించింది. దీంతో విశాఖ వచ్చి మళ్ళీ తిరిగి నిర్దేశించిన మార్గంలో అరకు బయలుదేరింది హెలికాప్టర్.

చంద్రబాబు 'రా కదలిరా' కార్యక్రమానికి హాజరయ్యేందుకు అరకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. బొబ్బిలి తర్వాత రా కదలిరా కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్రలో ఇది రెండో బహిరంగ సభ.

అరకులోయ బహిరంగ సభ వేదిక వద్ద స్టేజీ పనులు, పార్కింగ్, హెలిప్యాడ్, సీటింగ్ తదితర పనులను టీడీపీ నేత కిడారి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, ఇతర నేతలు పరిశీలించారు. అరకు, డుంబ్రిగూడ మండలాలకు చెందిన టీడీపీ (TDP) నాయకులు కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నిమగ్నమై ఉన్నారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతం కావడంతో ఏఎస్‌ఆర్ పోలీసులు ఆ ప్రాంతాన్ని పూర్తి భద్రతా వలయంలోకి తీసుకొచ్చారు. పాడేరు అదనపు ఎస్పీ కె.ధీరజ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించడం కనిపించింది.

Also Read: మరో పెళ్ళి చేసుకున్న షోయబ్ మాలిక్?

Advertisment
తాజా కథనాలు