AP Free Bus Scheme : తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం బాటలోనే అడుగులు వేసేందుకు ఏపీలో కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) సమయంలో ఇచ్చిన హామీలలో ముఖ్యమైన హామీ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో టికెట్ లేని ప్రయాణం పథకాన్ని అమలు (Free Bus Scheme) చేసే దిశగా అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం. రేపు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఏపీ సీఎంగా ప్రాణాస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. అయితే.. మొదటి సంతకం మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసేందుకు పెట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే మెగా డీఎస్సి పై కూడా చంద్రబాబు తొలి సంతకం చేస్తారనే చర్చ కూడా మొదలైంది. వాస్తవానికి ఈ రెండిటిపై కూడా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
సీఎం రేవంత్‌ను చంద్రబాబు కాపీ..
తెలంగాణలో రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అనుసరించి అదే విధంగా ఏపీలో కూడా ఈ పథకాన్ని ప్రారంభించేందుకు విధివిధానాలను రుపొంచించాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఐదుగురు ప్రత్యేక అధికారులతో ఓ కమిటీని వేసినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మొదటగా ప్రారంభించిన విషయం తెలిసిందే.
జులై 1 నుంచి..
మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకాన్ని జులై 1 నుంచి అమలు చేయాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్నే అనుసరించాల్సిందిగా చంద్రబాబు అధికారులకు సూచించినట్లు సమాచారం. కాగా దీనిపై మరో రెండ్రోజుల్లో అధికారిక ప్రకటన రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Also Read : ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు