Chandrababu Case Update:చంద్రబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

హైకోర్టులో చంద్రబాబుకు‌ ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసు, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో బెయిల్, ముందస్తు బెయిల్ పిటిషన్లు ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. 

Chandrababu Case Update:చంద్రబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ
New Update

Chandrababu Bail Petition Dismissed: హైకోర్టులోనూ చంద్రబాబుకు సంబంధించిన మూడు బెయిలు పిటిషన్లపై ఈరోజు తీర్పులు వెల్లడి అయ్యాయి. రాజధాని అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (Amaravati Inner Ring Road Case), అంగళ్లు, ఫైబర్‌ నెట్‌ కేసుల్లో బెయిలు కోసం చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్ల మీద శుక్రవారం వాదనలు ముగిసాయి. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డి తీర్పులను సోమవారం అంటే ఈరోజుకు రిజర్వు చేసిన సంగతి తెలిసిందే. ఈ మూడు పిటిషన్లను కొట్టేస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పును ప్రకటించింది.

మరోవైపు సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు మీద ఉన్న కేసును కొట్టేయాలంటూ ఆయన తరుఫు లాయర్లు క్వాష్ పిటిషన్ వేశారు. దీని మీద ఈరోజు అత్యన్నత న్యాయస్థానం తీర్పును ఇవ్వనుంది. ఈ కేసు సుప్రీంకోర్టులో 59వ ఐటెమ్ గా లిస్ట్ అయింది. జస్టిస్ అనిపుధ్ బోస్, జస్టిస్ బేలా. ఎమ్.త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారణ చేయనుంది. చంద్రబాబు తరుపున సీనియర్ లాయర్లు హరీష్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వి,సిద్ధార్ధ లూథ్రా వఆదనలు వినిపించనున్నారు. ఏపీ ప్రభుత్వం తరుపున ముకుల్ రోహ్గతి వాదనలు వినిపిస్తారు. ముందస్తు అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం న్యాయం కాదని ఆయన తరుపు లాయర్లు వాదించారు. సెక్షన్ 17ఏ ప్రకారం అరెస్ట్ కు గవర్నర్ అనుమతి తప్పనిసరి అని కోర్టుకు తెలిపారు. అందుకే బాబు మీద ఉన్న ఎఫ్ఐఆర్ కొట్టేయాలని, జ్యూడీషియల్ రిమాండ్ రద్దు చేయాలని కోర్టును కోరారు.

Also Read:ఇజ్రాయెల్‌కు విమాన వాహక నౌకతో పెద్దన్న దన్ను.

#high-court #chandrababu-arrest #chandrababu-bail-petition-dismissed #chandrabau #chandrababu-case-update
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe