Rain alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

New Update
IMD: బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి భారీ వర్ష సూచన!

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం అధికంగా ఉందని తెలిపారు. దీంతో పాటు కృష్ణా, గుంటూరు, జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్‌ ఉందని తెలిపారు.

కోస్తా ప్రాంతాల్లోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. లంక గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. మరోవైపు ముంపు ప్రాంతాలకు ఎన్టీఆర్‌ఎఫ్ సిబ్బందిని తరలిస్తున్నట్లు అధికారిక యంత్రాంగం తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ముఖ్యంగా అదిలాబాద్‌, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌ నగర్, నల్గొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

కాగా ఇవాళ హైదరాబాద్‌లో వర్షం కురిసింది. మధ్యాహ్నం వాతావరణ ఒక్కసారిగా మారడంతో నగరంలోని జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, బేగంపేట్, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మెహదీపట్నం, లక్డికాపూల్, కోటి, దిల్ సుఖ్ నగర్, బేగంబజార్, చార్మినార్, రాణిగంజ్, ప్యాట్నీ, ప్యారడైజ్, సుచిత్ర, జీడిమెట్ల, చింతల్, బాల్ నగర్, కూకట్ పల్లి వంటి అనేక ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. దీంతో రోడ్లన్ని జలమయమయ్యాయి. దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు