CEO : పల్నాడుపై ఈసీ స్పెషల్ ఫోకస్.. క్షేత్రస్థాయికి వెళ్లి సీఈఓ పరిశీలన

ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా ఈ రోజు పల్నాడు ప్రాంతంలో పర్యటించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రానలు సైతం సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

CEO : పల్నాడుపై ఈసీ స్పెషల్ ఫోకస్.. క్షేత్రస్థాయికి వెళ్లి సీఈఓ పరిశీలన
New Update

Palnadu : పోలింగ్ (Polling) అనంతరం పల్నాడు ప్రాంతంలో భారీగా హింస చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రాంతంపై ఈసీ (EC) స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రత్యేకంగా అక్కడికి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తాతో కలిసి సీఈవో (CEO) అక్కడ పర్యటించారు. అనంతరం అల్లర్లపై కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పరిస్థితిపై కలెక్టర్‌ బాలాజీరావు, ఎస్సీ మల్లికా గార్గ్ నుంచి వివరణ తీసుకున్నారు. నరసరావుపేట మండలం కాకాని JNTU కళాశాలలో కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర సీసీ ఫుటేజ్‌ ను పరిశీలించారు. రిజిస్టర్‌ మెయింటేన్‌ చేయాలని అధికారులకు సీఈవో ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర ఏర్పాట్లు, బందోబస్తుపై సమీక్ష నిర్వహించారు. టీడీపీ ఏజెంట్లతో మాట్లాడి ముఖేష్‌ కుమార్‌ మీనా పలు విషయాలపై ఆరా తీశారు.

Also Read : బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై మరో కేసు

#ceo-mukesh-kumar-meena #election-commission #polling #jntu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి