CEO Mukesh Kumar Meena: ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు.. సీఈవో కీలక ప్రకటన

ఏపీలో మొత్తం 4.14కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు సీఈవో మీనా కుమార్. అందులో 2,03,39,851 మంది పురుష ఓటర్లు.. 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. తనిఖీల్లో 203 కోట్ల విలువైన నగదు, మద్యం, అభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

New Update
AP CEO: 119 స్పెషల్ కమిషనర్స్.. 5గంటల లోపు ఫలితాలు.. ఏపీ సీఈఓ సెన్సేషనల్ కామెంట్స్..!

CEO Mukesh Kumar Meena: ఏపీలో ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు సీఈవో మీనా కుమార్. ఏపీలో మొత్తం 4,14,01,887 మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. అందులో 2,03,39,851 మంది పురుష ఓటర్లు, 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. తుది జాబితా ప్రకటన తర్వాత 5,94,631 మంది కొత్తగా ఓటర్లుగా నమోదయ్యారని అన్నారు. ఎన్నికల కోసం మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ALSO READ: నిరుద్యోగులకు నెలకు రూ.6,000.. సంచలనంగా కేఏ పాల్ మేనిఫెస్టో

ఎన్నికల అధికారి మీనా మాట్లాడుతూ.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 864 FIR లు ఫైల్ చేసామన్నారు. 72,416 మందిని బైండ్ ఓవర్ చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకూ 203 కోట్ల విలువైన నగదు, మద్యం, అభరణాలు స్వాదీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 29,897 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నామని చెప్పారు. 14 నియోజకవర్గాల్లో 100 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, ఎక్కువ మంది కేంద్ర బలగాలతో పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఎండలు ఎక్కువగా ఉండటంతో మెడికల్ కిట్స్, ORS ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. కేవలం 28,591 మంది మాత్రమే హోం ఓటింగ్ కు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. జనసేన గ్లాస్ గుర్తు పై కోర్టు తీర్పు తర్వాత 15స్థానాల్లో అభ్యర్థులకు గుర్తు మార్పు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 8 లోగా హోం ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. అభ్యర్థులు ఎక్కువగా ఉన్నచోట బ్యాలెట్ యూనిట్లు ఎక్కువగా పెట్టాల్సి వస్తుందని.. అభ్యర్థులు ఎక్కువ మంది ఉండటంతో 15 వేల బ్యాలెట్ యూనిట్లు ఎక్కువగా అవసరం అయ్యాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో 374 ఎమ్మెల్యే అభ్యర్థులు, 64 ఎంపీ అభ్యర్థులకు భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు