Yogi Kadsur: సైకిల్ గురు ఇకలేరు.. గుండెపోటు వార్తవిని ఖంగుతిన్న డాక్టర్లు

సైకిల్ గురు, సైకిల్ యోగి, సెంచరీ సైకలిస్ట్, ఫిట్ నెస్ ట్రైనర్ అనీల్ కద్సూర్ ఇకలేరు. బెంగళూరుకు చెందిన ఆయన 45 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించారు. సైకిలింగ్ లో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు పొందిన ఆయన మరణం వైద్యులను విస్మయానికి గురిచేస్తోంది.

New Update
Yogi Kadsur: సైకిల్ గురు ఇకలేరు.. గుండెపోటు వార్తవిని ఖంగుతిన్న డాక్టర్లు

Bangalore: సైకిలింగ్ లో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు పొందిన అనీల్ కద్సూర్ (Anil Kadsur) ఇకలేరు. బెంగళూరుకు చెందిన ఆయన 45 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించాడు. సైకిల్ గురు, సైకిల్ యోగి, సెంచరీ సైకలిస్ట్, ఫిట్ నెస్ ట్రైనర్ గానూ ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ఆయన హార్ట్ ఎటాక్ తో చనిపోవడం డాక్టర్లను సైతం విస్మయానికి గురి చేసింది.

ప్రతి రోజూ 100 కిలోమీటర్లు..
ఈ మేరకు ఎల్లప్పుడూ సైకిల్ తొక్కటాన్ని ప్రోత్సహించిన ఆయన.. ఆఫీసుకు కూడా సైకిల్ పైనే వెళ్లేవాడు. అన్ని పనులు సైకిల్ ద్వారానే చేసుకునేవాడు. సైకిల్ తొక్కడం వల్ల నిరంతరం ఆరోగ్యంగా ఉంటామని, మెరుగైన ఆరోగ్యం కోసం సైకిల్ అనేది చాలా చాలా మంచి చేస్తుందని పాఠాలు చెబుతూ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఆయన ఇన్నాళ్లుగా 2 లక్షల 71 వేల కిలోమీటర్లు సైకిల్ పై తిరిగినట్లు ఇటీవలే వెల్లడించారు. ప్రతి రోజూ 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కినట్లు కూడా చెప్పాడు. అలాంటి సైకిల్ గురు గుండెపోటుతో చనిపోవడంపై డాక్షర్లు షాక్ అవుతున్నారు.

గుండె ఆరోగ్యాన్ని పెంచుతుందని..
సైకిల్ తొక్కటం అనేది గుండె ఆరోగ్యాన్ని పెంచుతుందని, నరాల బలానికి, కండరాల బలానికి కూడా ఉపయోగపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అంతేకాదు ప్రముఖ కార్డియాలజిస్టులు, న్యూరాలిస్టులు రన్నింగ్, వాకింగ్, సైకిలింగ్ చేయటం ద్వారా గుండె సంబంధం వ్యాధుల నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు. అలాంటి సైకిలింగ్ ద్వారా ఎంతో ఆరోగ్యంగా ఉన్న అనీల్ కద్సూర్ గుండెపోటుతో చనిపోవటం హాట్ టాపిక్ గా మారింది.

ఇది కూడా చదవండి : Hyderabad: అన్నదమ్ముల షూ వివాదం.. అతిథిగా వచ్చిన అల్లుడు హతం

అయితే అతి వ్యాయామం కారణంగానే ఆయన చనిపోయాడని వైద్యులు అంటున్నారు. అవసరానికి మించి సైకిల్ తొక్కటం కూడా ప్రమాదమని హెచ్చిరిస్తున్నారు. అతిగా సైకిలింగ్ చేయటం ద్వారా నిద్రలేమి వస్తుందని.. ఇదే అనీల్ కద్సూర్ మరణానికి కారణం కావొచ్చంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు