GST Council: జీఎస్టీ కౌన్సిల్ సంచలన నిర్ణయం.. పన్నులు కట్టేవారికి శుభవార్త! చిరు వ్యాపారులకు మేలు జరిగేలా జీఎస్టీ కౌన్సిల్‌లో నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పన్నులు కట్టేవారి కోసం అనేక అనుకూల నిర్ణయాలు తీసుకున్నామన్నారు. కేంద్రం అందజేస్తున్న 50 ఏళ్ల వడ్డీ రహిత రుణాలను వినియోగించుకోవాలని కోరారు. By srinivas 22 Jun 2024 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి GST Council Meeting: చిరు వ్యాపారులకు మేలు జరిగేలా జీఎస్టీ కౌన్సిల్‌లో నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) చెప్పారు. రాష్ట్ర ఆర్థిక మంత్రుల సమావేశంలో పన్నులు కట్టేవారి కోసం అనేక అనుకూల నిర్ణయాలు తీసుకున్నామన్నారు. కేంద్రం అందజేస్తున్న 50 ఏళ్ల వడ్డీ రహిత రుణాలను వినియోగించుకోవాలని కోరారు. #WATCH | On the 53rd GST Council Meeting, Union Finance Minister Nirmala Sitharaman says, "Council recommended to prescribe a uniform rate of 12% on all milk cans meaning steel, iron, aluminum which are irrespective of the use. They are called milk cans but wherever they are used… pic.twitter.com/csf4Nmx2n3 — ANI (@ANI) June 22, 2024 ఈ మేరకు ఢిల్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రులతో సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆర్థిక మంత్రి.. జీఎస్టీ గత సమావేశం అక్టోబర్‌లో జరిగింది. ఎన్నికల కోడ్ కారణంగా చాలా రోజులుగా జీఎస్టీ కౌన్సిల్ భేటీ జరగలేదు. అజెండా విషయాలపై మరోసారి సమావేశం నిర్వహిస్తాం. జీఎస్టీ మండలిలో అనేక విషయాలు చర్చించాం. ఆగస్టు చివరి వారం మళ్లీ సమావేశమవుతాం. పన్నులు కట్టేవారి కోసం అనేక అనుకూల నిర్ణయాలు తీసుకున్నాం. జీఎస్టీ సెక్షన్ 73 కింద డిమాండ్ నోటీసులు ఇచ్చామని చెప్పారు. అలాగే మార్చిలోగా పన్ను కట్టేవారికి మినహాయింపులు ఇస్తున్నట్లు తెలిపారు. జీఎస్టీపై ట్రైబ్యునళ్లు, కోర్టులకు వెళ్లే ట్రాన్సాక్షన్ సమయం పెంచినట్లు చెప్పారు. చిన్న వ్యాపారులకు మేలు కలిగేలా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలున్నాయన్నారు. జరిమానాలపై విధిస్తున్న వడ్డీని ఎత్తివేయాలనే ప్రతిపాదనలు వచ్చాయి. సీజీఎస్టీ చట్టంలో సవరణలకు జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదించింది. జీఎస్టీ కట్టేందుకు గడువును పొడిగించాని స్పష్టం చేశారు. వీటిపై GST రేట్లు తగ్గింపు * రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్లు, వెయిటింగ్, లాకర్ రూమ్స్, బ్యాటరీ ఆపరేటెడ్ సర్వీసులు, ఇంట్రా రైల్వే సర్వీసులపై జీఎస్టీ రద్దు. * మిల్క్ క్యాన్లు, కార్టన్ బాక్సులపై GST 18% నుంచి 12%కు తగ్గింపు. * సోలార్ కుక్కర్లపై 18% నుంచి 12%కు GST తగ్గింపు. Also Read: ఎల్లుండి నుంచి లోక్‌సభ సమావేశాలు షురూ #gst #finance-minister-nirmala-sitharaman మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి