తెలంగాణ పర్యటనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా... ఇల్లందు నియోజకవర్గంలో కేంద్రమంత్రి బీఎల్ శర్మ పర్యటించారు. ఇల్లందు పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ అభివృద్ధిని దిశగా పరుగులు పెడుతుందని.. జీ20 సమావేశాల నిర్వహణతో భారతదేశం తన సత్తాతో 140 కోట్ల ప్రజల గౌరవాన్ని నిలపెట్టేలా... ప్రపంచ దేశాలు భారత వైపు చూసేలా నిర్వహించారని తెలిపారు. దశాబ్దాల మహిళా బిల్లును కలను సాకారం చేశారన్నారు.
This browser does not support the video element.
ఇల్లందులో బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న మహిళా బిల్లు కలను సాకారం చేశారని అన్నారు. కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన ఇల్లు పేదలకు కలగానే మిగిలిందని మండిపడ్డారు. రుణమాఫీ పేరిట రైతులను ప్రభుత్వం మోసం చేసిందని బీఎల్ శర్మ పేర్కొన్నారు. హర్ ఘర్ జల్, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పలు పథకాలను విజయవంతంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంటే.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన రెండు పడక గదుల ఇల్లు పేదలకు కలగానే మిగిలిందని బీఎల్ శర్మ విమర్శించారు.
పార్టీకి బై బై చెప్పి
రుణమాఫీ పేరిట రైతులను ప్రభుత్వం మోసం చేసిందని తెలంగాణ ప్రభుత్వం కాదా అని ఆయన ప్రశ్నించారు. పేదల, రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకే వ్యూహంతో వ్యవహరిస్తున్నాయని.. స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఆ పార్టీకి బై బై చెప్పి బీఆర్ఎస్‌లోలో చేరారన్నారు మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు యువత భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో భారతీయ పార్టీని గెలిచి కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో డబల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు అవుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు వచ్చినా..! తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: తిరుపతిలో రెచ్చిపోయిన స్మగ్లర్లు.. భారీగా ఎర్రచందనం స్వాధీనం