Amith Shah: 2026 నాటికి నక్సలిజం అంతం–‌‌ కేంద్ర హోంమంత్రి అమిత్ షా

మావోయిస్టుల హింస ప్రజాస్వామ్యానికి సవాలుగా మారిందని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 2026 నాటికి నక్సలిజం అనేది లేకుండా చేస్తామని చెప్పారు. దీని కోసం పకడ్బందీతో కూడిన బలమైన వ్యూహం అవసరమని ఆయన అన్నారు.

Amith Sha: కేంద్రమంత్రికి కారు లేదంట..ఎన్నికల అఫిడవిట్‌లో అమిత్‌ షా ఆస్తుల వివరాలు
New Update

Amith Shah: ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పుర్‌లో నిర్వహించిన అంతర్రాష్ట్ర సమన్వయ సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొని మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్రలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీనిలో దేశంలో చెలరేగుతున్న నక్సలిజం గురించి అమిత్ షా మాట్లాడారు. రాబోయే రోజుల్లో నక్సలిజాన్ని ఎలా అయినా అంతమొందించాలని హోంమంత్రి చెప్పారు. ఇప్పటివరకు 17వేల మంది నక్సలిజాలని బలయ్యారని అన్నారు. 2026కు దీన్ని అంతమొందించాలని..నక్సల్స్‌ అంతానికి బలమైన, పకడ్బందీ వ్యూహం అవసరమన్నారు.

2004-14 మధ్య కాలంతో పోలిస్తే 2014-24 మధ్యకాలంలో నక్సల్స్‌ సంబంధిత ఘటనల్లో 53 శాతం తగ్గుదల నమోదైనట్లు కేంద్రమంత్రి అమిత్ షా తెలిపారు. 2026 మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదం నుంచి దేశాన్ని విముక్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. ఎన్‌ఐఏ, ఈడీ వంటి కేంద్ర సంస్థలు మావోయిస్టు హింస నిర్మూలనకు కృషి చేస్తున్నాయని తెలిపారు.

Also Read: Madhya Pradesh: ప్రిన్సిపల్ చెంప పగులకొట్టిన విద్యార్థి..వీడియో వైరల్

#amith-shah #central-home-minister #naksalism
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe