Andhra Pradesh: ఏపీలోని నాలుగు జిల్లాలో యురేనియం కోసం అన్వేషణ..

ఏపీలోని అన్నమయ్య, పల్నాడు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో యురేనియం కోసం అన్వేషిస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఏపీలో కనంపల్లె, తెలంగాలణలో చిత్రియాల్ వద్ద కొత్త గనులు, ప్లాంట్‌లు ఏర్పాటు చేయడంపై యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రయత్నిస్తోందన్నారు.

New Update
Andhra Pradesh: ఏపీలోని నాలుగు జిల్లాలో యురేనియం కోసం అన్వేషణ..

Uranium in AP: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో యురేనియం కోసం అన్వేషణ మొదలైంది. అన్నమయ్య, పల్నాడు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో దీని కోసం అన్వేషిస్తున్నామని కేంద్ర అణు ఇంధనశాఖ మంత్రి జితేంద్ర సింగ్ (Jitendra Singh) తెలిపారు. గురువారం రాజ్యసభలో సంత్ బల్బీర్‌సింగ్‌ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. పల్నాడు జిల్లాలో సారంగపల్లె, మదినపాడు, తంగెడ ప్రాంతాలు, వైఎస్సార్ జిల్లాలో కుమరంపల్లె, నాగాయపల్లె, అంబకాపల్లె, బక్కన్నగారిపల్లె, శివారంపురం, నల్లగొండవారిపల్లె, పించ ప్రాంతాలు అలాగే కర్నూల్ జిల్లాలో మినకహల్‌పాడు, కప్పట్రాళ్ల, బొమ్మరాజుపల్లె.. అన్నమయ్య జిల్లాలో వరికుంటపల్లె, కాటమయకుంట ప్రాంతాలు ఉన్నాయని చెప్పారు. ఆటమిక్ మినరల్స్ డైరెక్టరేట్‌ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్(ఏఎండీ) ఇటీవల కాలంలో అన్వేషించినట్లు పేర్కొన్నారు.

Also read: నడుచుకుంటూ వెళ్ళి శ్రీవారిని దర్శించకున్న దీపికా పడుకోన్

అయితే ఏపీలో కనంపల్లె.. తెలంగాలణలో చిత్రియాల్ వద్ద కొత్త గనులు, ప్లాంట్‌లు ఏర్పాటు చేసే విషయంలో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (UCIL) ప్రయత్నాలు మొదలుపెట్టిందని తెలిపారు. ప్రస్తుతం ఈ పనులన్నీ వివిధ దశలో ఉన్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు 11 రాష్ట్రాల్లో ఏఎండీ యురేనియం (Uranium) అన్వేషణ మొదలుపెట్టిందని చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 4.10 లక్షల టన్నుల యురేనియం నిల్వలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.

మరోవైపు.. ఏపీలోని జాతీయ రహదారి -16లో విజయవాడ-గుండుగొలు మధ్య చేపడుతున్న 104 కి.మీ రోడ్డు నిర్మాణం పూర్తి కావడానికి కొన్ని అడ్డంకులు ఏర్పడుతున్నాయని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. లోక్‌సభలో వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. కేంద్ర రహదారి, రవాణాశాఖ ఈ ప్రాజెక్టును నాలుగు ప్యాకేజీలుగా చేపట్టిందని.. వీటిలో ఇప్పటివరకు 1,2 ప్యాకేజీ పనులు మాత్రమే పూర్తైనట్లు పేర్కొన్నారు. ప్యాకేజీ 3,4లో విజయవాడ బైపాస్ నిర్మాణం ఉన్నట్లు చెప్పారు. కరోనా వైరస్, భారీ వర్షాలు, కోర్టు కేసులు తదితర కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం అయినట్లు తెలిపారు.

Also Read: నకిలీ ఓట్లపై ఈసీకు ఫిర్యాదు చేసిన పురంధేశ్వరి.!

Advertisment
Advertisment
తాజా కథనాలు