రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం

ఈరోజు జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో రైతులకు తీపి కబురు అందించింది కేంద్రం. రబీ సీజన్ లో ఎరువులపై సబ్సిడీకి కేంద్రం ఆమోదం తెలిపింది. రైతులకు అద్దె పద్దతిలో డ్రోన్లు అందించి ఉపాధి పొందేలా కొత్త పథకం ప్రవేశపెట్టనుంది.

PM Kisan Update : రైతులకు అలెర్ట్.. పీఎం కిసాన్‌ 17వ నిధుల విడుదలపై కీలక్‌ అప్‌డేట్‌!
New Update

Central Cabinet Meeting: దేశరాజధాని ఢిల్లీలో ప్రధాని మోదీ (PM Modi) అధ్యక్షతన కేంద్ర కేబినెట్ (Central Cabinet) భేటీ అయ్యింది. ఈ భేటీలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్‌లను అందించే కేంద్ర రంగ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

వ్యవసాయ అవసరాల కోసం రైతులకు అద్దె సేవలను అందించడానికి 2023-24 నుండి 2025-2026 మధ్యకాలంలో ఎంపిక చేసిన 15,000 మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్‌లు అందించబడతాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) తెలిపారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.1,261 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు.

ALSO READ: BREAKING: ఏపీలో ముందస్తు ఎన్నికలపై సజ్జల క్లారిటీ!

రబీ సీజన్ లో ఎరువులపై సబ్సిడీకి (Fertilisers Subsidy) కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై రూ.22, 303 కోట్ల భారం పడనుంది. అలాగే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనని (PMGKAY) పొడిగిస్తున్నట్లు తెలిపింది. 2024 నుంచి మరో ఐదు ఏళ్లపాటు పొడిగిస్తున్నట్లు పేర్కొంది.

పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కోవిడ్ మహమ్మారి ప్రారంభ సమయంలో ప్రారంభించబడింది, ఈ పథకం ద్వారా రేషన్ కార్డ్ హోల్డర్లు అదనంగా ఐదు కిలోల ధాన్యాలు (వ్యక్తిగత ఎంపిక గోధుమలు లేదా బియ్యం) పొందేందుకు అర్హులు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 81 కోట్ల మందికి లబ్ది చేకూరనుంది. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.11.80 కోట్లు ఖర్చు చేస్తోంది.

ALSO READ: చంద్రబాబు, పవన్‌ కలవకూడదని జగన్ కుట్ర చేశాడు.. లోకేష్ ఫైర్!

#cabinet-meeting #fertilisers-subsidy #telugu-latest-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe