Fertilisers Subsidy: రైతులకు మోదీ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. ఎరువులపై సబ్సిడీ..
కేంద్రప్రభుత్వం రైతులకు అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది. రబీ పంట సీజన్లో వివిధ ఎరువుల కోసం సబ్సిడీ ఇవ్వనుంది. నత్రజని, భాస్వరం, పొటాష్, సల్ఫర్ వంటి తదితర ఎరువల కోసం.. పోషకాధారిత సబ్సిడీ రేట్లను కేంద్ర మంత్రివర్గం తాజాగా ఆమోదం తెలిపింది. ఈ ఎరువులపై సబ్సిడీ కోసం దాదాపు రూ.22,303 కోట్ల విడుదలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు పెరిగినా కూడా రైతులకు భారం కాకుండా సబ్సిడీ కొనసాగుతుందని స్పష్టం చేసింది.