Farmers Protest: ఢిల్లీకి పాదయాత్ర కొనసాగుతుంది: రైతు సంఘాలు!

చండీగఢ్‌ ప్రభుత్వం, రైతుల మధ్య జరిగిన సమావేశం విఫలం కావడంతో రైతు సంఘాలు ఢిల్లీకి వెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దాదాపు 5 గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో ప్రభుత్వం రైతు సంఘాల డిమాండ్లను పరిష్కారించలేకపోయింది.

New Update
Farmers Protest: ఢిల్లీకి పాదయాత్ర కొనసాగుతుంది: రైతు సంఘాలు!

Delhi Chalo: మంగళవారం ఢిల్లీలో రైతు సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టేందుకు రెడీ అయ్యాయి. చండీగఢ్‌ ప్రభుత్వం, రైతుల మధ్య జరిగిన సమావేశం విఫలం కావడంతో రైతు సంఘాలు ఢిల్లీకి వెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దాదాపు 5 గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో ప్రభుత్వం రైతు సంఘాల డిమాండ్లను పరిష్కారించలేకపోయింది.

దీంతో రైతు సంఘాలు ఢిల్లీకి వెళ్లేందుకు పయనమయ్యాయి. ఢిల్లీకి పాదయాత్ర కొనసాగుతుందని, మా ఉద్యమం ఆపేది లేదని రైతు సంస్థలు తెలిపాయి.

ఎంఎస్‌పీ డిమాండ్‌పై రైతులు మొండిగా?

ప్రభుత్వం ఆలోచనలో లోపం ఉందని రైతు సంఘం పేర్కొంది. మంగళవారం ఉదయం 10 గంటల తరువాత రైతు సంఘాలు ముందుకు కదులుతాయని తెలిపాయి. మేము చేస్తున్న డిమాండ్ల పట్ల ప్రభుత్వ వైఖరి మొండిగా ఉందని రైతు సంఘాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రతిపాదన లేదని రైతు నాయకులు తెలిపారు.

మా డిమాండ్లపై ప్రభుత్వం సీరియస్‌గా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఫిబ్రవరి 13న ఉదయం 10 గంటలకు మళ్లీ ఢిల్లీకి వెళతాం. ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనను పరిశీలిస్తామని రైతు సంఘం తెలిపింది.

ఢిల్లీలో రైతులు నిరసనలు 

ఢిల్లీ చలో నినాదాన్ని లేవనెత్తుతూ పంజాబ్ రైతులు ఢిల్లీలో నిరసనకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో హర్యానా ప్రభుత్వం పంజాబ్‌తో సరిహద్దులను మూసివేసింది. అదే సమయంలో, హర్యానాలోని అనేక జిల్లాల్లో 144 సెక్షన్ విధించడం జరిగింది. ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిపివేశారు. ఈ సమయంలో, ఢిల్లీ-ఎన్‌సీఆర్, హర్యానాకు కూడా అధికారులు ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు పాటించాలని ఆదేశాలు చేశారు.

రైతు సంఘాలు ఢిల్లీ చలో నినాదంతో ముందుకు కదులుతుండడంతో కొన్ని మార్గాలను పూర్తిగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు.
బదులుగా వాహనాలను ఇతర మార్గాల్లోకి మళ్లిస్తారు, దీని ద్వారా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుంది. వేరే మార్గాల ద్వారా ప్రయాణికులు, వాహనాదారులు తమ గమ్య స్థానాలకు చేరుకోనున్నారు.

Also read: శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే ..గుండెపోటుకు సంకేతం కావొచ్చు!

Advertisment
Advertisment
తాజా కథనాలు