broadcasting bill 2024: యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు బిగ్ షాక్.. త్వరలోనే ఆ కొత్త చట్టం?

ప్రసార సేవల నియంత్రణ బిల్లుపై మళ్లీ కదలిక వచ్చింది. అయితే.. కేంద్రం తేనున్న కఠిన నిబంధనలతో ఇండిపెండెంట్ జర్నలిస్టులు, సోషల్ మీడియాపై ఆధారపడి నడిచే వార్తా సంస్థలకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

YouTube : మొన్న మైక్రోసాఫ్ట్‌.. నిన్న యూట్యూబ్‌..కొద్దిసేపు నిలిచిన సేవలు!
New Update

You Tube: దేశంలో లోక్‌సభ ఎన్నికల సమయంలో పలువురు యూట్యూబర్లు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు తమకు వ్యతిరేకంగా పని చేశారని బీజేపీ ప్రభుత్వం అనుకుంటుందా? అందుకే ఎన్నికల్లో తాము ఆశించిన స్థాయి రిజల్ట్‌ రాలేదని భావిస్తోందా..? అంతేకాకుండా యూట్యూబర్లు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఇలా చేయడం వల్ల ప్రతిపక్షాలకు కూడా బాగా హెల్ప్‌ అయ్యిందన్న కారణంతోనే ఓ కొత్త చట్టన్ని తేవాలని భావిస్తున్నట్లు చర్చ సాగుతోంది. ప్రసార సేవల నియంత్రణ బిల్లు విషయంలో ప్రభుత్వం పాటిస్తున్న గోప్యత కారణంగా ఈ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ బిల్లుపై ప్రతిపక్షాల నుంచి యూట్యూబర్ల వరకు మోదీ ప్రభుత్వం మీద ఆ బిల్లు మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.‘ప్రసార సేవల నియంత్రణ బిల్లు’ తొలి ముసాయిదా గతేడాది విడుదలైంది. ప్రధానంగా ఓటీటీ వేదికలు, ప్రసార సంస్థలను ఉద్దేశించి రూపొందించిన ఈ బిల్లుపై అప్పట్లోనే ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలు రావటంతో ఈ అంశం తాత్కాలికంగా పక్కకు వెళ్లింది. ఎన్నికలు ముగిసి మోదీ వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో తాజాగా మరోసారి బిల్లు గురించి చర్చ ప్రారంభమైంది.

ఈ బిల్లులో కొన్ని సవరణలు చేసి, ఎంపిక చేసిన కొందరికి ఇటీవలే ఆ కాపీలను అందజేశాని, వారితోనే దీనిపై సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అంతేకాదు..  ఆ బిల్లు కాపీలపై ఓ ప్రత్యేకమైన వాటర్‌మార్క్‌ ప్రింట్‌ చేసి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎవరైనా బిల్లును కానీ బయట వారికి ‘లీక్‌’ చేస్తే ఎవరి ద్వారా అది జరిగిందో తెలుసుకోవటానికి ఈ వాటర్‌ మార్క్‌ ఉపయోగపడుతుందని సమాచారం.

అయితే దేశ ప్రజలను ప్రభావితం చేసే చట్టాల రూపకల్పన విషయంలో ఇంతటి గోప్యత ఏమిటంటూ ఓ ప్రముఖ ఇంగ్లీష్‌ దినపత్రిక ‘ తన సంపాదకీయం ద్వారా కేంద్రాన్ని కొద్ది రోజుల క్రితం ప్రశ్నించింది. సవరించిన బిల్లులో స్వతంత్ర మీడియా గొంతు నొక్కే పలు ఆంశాలున్నాయంటూ విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా.. స్వతంత్ర భారతదేశంలో మనకున్న భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై ఈ బిల్లు ప్రత్యక్ష దాడే అంటూ పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, స్వతంత్ర మీడియా సంస్థలపై ప్రభుత్వ నిఘా పెరుగుతుందన్నారు. బిల్లులో సవరణలు చేసి ఆ ప్రతులను రహస్యంగా కొందరు వ్యక్తులకు, కొన్ని వ్యాపారసంస్థలకు ఇచ్చారని, పార్లమెంటుకు మాత్రం ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని టీఎంసీ ఎంపీ జవహర్‌ సర్కార్‌ తెలిపారు.

అసలు ఆ సవరించిన బిల్లులో ఉన్న మ్యాటరేంటి?

కేంద్ర ప్రభుత్వం సవరించిన బిల్లు ఇప్పటి వరకూ కూడా బయటకు రాలేదు. నిజానికి ఒక బిల్లు చట్ట రూపం దాల్చాలంటే దాని ముసాయిదాను బహిరంగంగా వెల్లడించి, దానిపై ప్రజానీకం నుంచి సానుకూల భావన రావాలి. ఒకవేళ ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాటిని కూడా స్వీకరించాలి. ఇలా ఇన్నీ పనులు చేసిన తరువాతనే సమీక్ష జరిపి అప్పుడు కానీ బిల్లుకు తుదిరూపం ఇవ్వరు. కానీ, ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లు విషయంలో మాత్రం ఎలాంటి ప్రక్రియ జరగడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇంతకూ ఈ వివాదాస్పద బిల్లులో ఉన్న అంశాలేంటో బయటకు వచ్చిన వివరాల ప్రకారం..

  • సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫాంలు అయినటువంటి ఇన్‌స్టా గ్రామ్‌, యూట్యూబ్‌ తదితర సోషల్‌ మీడియా వేదికల్లో ప్రజాదరణ ఉన్న వారిని ఇకపై డిజిటల్‌ వార్తా ప్రసారకులుగా గుర్తించనున్నారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన 30 రోజులు అంటే నెల రోజుల్లో ఈ డిజిటల్‌ వార్తా ప్రసారకులు తమ పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందించి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
  • డిజిటల్ వార్తా ప్రసారకులు కూడా ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటి ఓటీటీ వేదికలకు అమలవుతున్న మూడంచెల నియంత్రణ వ్యవస్థ కింది రానున్నారు.

ఇంకా.. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ డిజిటల్‌ వార్తా ప్రసారకుల కార్యాలయాలను ప్రభుత్వాధికారులు ఎప్పుడైనా తనిఖీ చేసే అధికారం ఉంటుంది. అక్కడున్న పరికరాలు, ఉపకరణాలు వేటినైనా స్వాధీనం కూడా చేసుకునే హక్కును ఈ చట్టం అధికారులకు కల్పిస్తుంది. నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే వారిపై నిషేధం అమలు చేయవచ్చు.

మెటా, యూట్యూబ్‌, ఎక్స్‌ వంటి సోషల్‌ మీడియా కంపెనీలు ప్రభుత్వం అడిగిన సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది.

అంతేకాదు, ఆన్‌లైన్‌ యాడ్‌ నెట్‌వర్క్‌లైన గూగుల్‌ యాడ్‌సెన్స్‌, ఫేస్‌బుక్‌ ఆడియెన్స్‌ నెట్‌వర్క్‌ వంటివి కూడా ఈ బిల్లు కిందికి రానున్నాయి. దీనివల్ల తమ ఆదాయం దెబ్బతినే అవకాశం ఉందని యూట్యూబర్లు, ఇతర సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వారందరికీ ఇబ్బందే?

సోషల్ మీడియా ముఖ్యంగా యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్లు వచ్చిన తర్వాత ఇండింపెండెంట్ జర్నలిస్టులు వారి అభిప్రాయాలను ఈ వేదికల నుంచి వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న వార్తా సంస్థలు కూడా ఈ ప్లాట్ ఫామ్ ల ఆధారంగా ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్నాయి. వీరు పెద్ద పెద్ద సంస్థలతో పోటీ పడి సైతం కవరేజీని అందిస్తున్నాయి. వీటి ప్రభావం ప్రస్తుతం బాగా పెరిగిపోయింది. ఇటీవల అనేక మంది రాజకీయ నాయులు తాము యూట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియా కారణంగానే ఓడిపోయామని చెప్పడం ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఇలాంటి వారికి ఈ చట్టం ఇప్పుడు ఇబ్బందుతు తెస్తుందనే ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాలపై ధిక్కార స్వరం వినిపించే వారికి ఈ చట్టం చిక్కులు తెచ్చే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.

Also read: కేటీపీఎస్‌లో 8 కూలింగ్‌ టవర్ల కూల్చివేత

#social-media #youtube #central-govt #bill
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe