కెనడాలో ఉన్న భారతీయులను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం

కెనడా- భారత్‌ల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కెనడాలో ఉన్న భారతీయులు, భారత్‌కు చెందిన విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

New Update
కెనడాలో ఉన్న భారతీయులను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం

కెనడా- భారత్‌ల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కెనడాలో ఉన్న భారతీయులు, భారత్‌కు చెందిన విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అక్కడ భారతీయులపై దాడులు జరిగే అవకాశం ఉందని, భారతీయులు ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. కెనడాలో హింసాత్మక పరిస్థితులను నెలకొన్నాయని రాజకీయంగా ఘర్షణలు జరుగుతున్నాయని గతంలో హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లొకి వెళ్లొద్దని హెచ్చరించింది. కాగా మంగళవారం కెనడా ప్రభుత్వం భారత్‌లో ఉన్న కెనడీయులు అప్రమత్తంగా ఉండాలని, ఉగ్రకుట్రలు జరిగే అవకాశం ఉందని తెలిపింది.

అంతే కాకుండా ఇండియాలో ఉన్న కెనడీయులు వీలైనంత త్వరగా అక్కడి నుంచి తిరిగి రావాలని హెచ్చరించింది. కాగా కెనడా ప్రభుత్వం భారత్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన మరోసటి రోజే భారత్ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలు చేసింది. ఖలిస్థాన్‌ మద్దతు దారుడి హత్య వెనుక భారత ప్రభుత్వం ఉండచ్చని కెనడా ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య వివాదం చోటు చేసుకుంది. మరోవైపు తమ వ్యాఖ్యలపై స్పందించిన ఆ దేశ ప్రభుత్వం దౌత్య పరంగా శాంతి చర్చలు జరిపేందుకు చర్యలు చేపట్టింది.

బ్రిటన్, రష్యా దేశాల దౌత్యవేత్తలతో కెనడా ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. భారత్‌తో కెనడాకు మంచి సంబంధాలు అవసరమని దీంతో తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోబోతున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలతో కెనడాలో ఉన్న భారతీయులు భయబ్రాంతులకు గురవుతున్నారు. కొందరు భారతీయులు ఇండియాకు తిరిగి వస్తున్నారు. ఇరు దేశాల మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నా.. అక్కడ ఉన్న భారతీయులు మాత్రం గందరగోళానికి గురవుతున్నారు.

Advertisment
తాజా కథనాలు