Telangana: కేసీఆర్ ను కేంద్రం బ్లాక్ మెయిల్ చేసింది.. బీఆర్ఎస్ నేత సంచలన అరోపణలు

తెలంగాణకు కృష్ణా జలాల హక్కు పరిరక్షణకై ఈ నెల 13న నల్లగొండ పట్టణంలో బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. అలాగే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కేంద్రం బ్లాక్ మెయిల్ చేసిందంటూ సంచలన ఆరోపణలు చేశారు.

Telangana: కేసీఆర్ ను కేంద్రం బ్లాక్ మెయిల్ చేసింది.. బీఆర్ఎస్ నేత సంచలన అరోపణలు
New Update

Niranjan Reddy: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కేంద్రం బ్లాక్ మెయిల్ చేసిందన్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మంగళవారం తెలంగాణ భవన్ లో బీఆర్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

నల్లగొండలో బహిరంగ సభ..
ఈ మేరకు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు కృష్ణా జలాల హక్కు పరిరక్షణకై ఈ నెల 13న నల్లగొండ పట్టణంలో బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. అలాగే ప్రధాన ప్రతిపక్షాన్ని కనీసం సంప్రదించకుండా కాంగ్రెస్ నాయకులు సంతకాలు చేయడం గొడ్డలి పెట్టుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 'అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుని పోవాలి. తెలంగాణలో ఇంటింటికీ ఈ సమస్యను తీసుకుని వెళ్తాం. కృష్ణా జలాల్లో న్యాయబద్ధమైన వాటా దక్కేదాకా పోరాటం ఆగదు. అకారణంగా ఏండ్లకేండ్లు కేంద్రం సాగదీస్తుంది. ఆరు మాసాల కాలంలోనే ట్రిబ్యునల్ తన తీర్పును వెల్లడించాలి. వాటాల కేటాయింపునకే దశాబ్దాల కాలం పడితే ప్రాజెక్టులను ఎట్లా కడుతాం' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనాలోచిత తప్పిదం..
అలాగే అనాలోచిత తప్పిదానికి ఘోర అన్యాయానికి పర్యవసానంగా కేఆర్ఎంబి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడేలా మారిందన్నారు. కేంద్రం బ్లాక్ మెయిల్ చేసినా కేసీఆర్ ప్రభుత్వం ఒప్పుకోలేదని, మీరు రెండు నెల్లకే అప్పజెప్పిండ్రంటూ రేవంత్ సర్కార్ పై మండిపడ్డారు. ఒకవేళ ప్రభుత్వం ముందుకు వస్తే తమ సహకారం ఉంటుందని, కానీ కాంగ్రెస్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమం చేసిందే నీళ్లకోసమని గుర్తు చేసిన ఆయన.. కరెంటు మంచినీరు సాగునీరు బాధలనుంచి రక్షించి రైతాంగానికి భరోసానిచ్చి దశాబ్దకాలంగా కాపాడితే కాంగ్రేస్ ప్రభుత్వం దారుణమైన తప్పిదానికి ఒడిగట్టిందన్నారు.r

ఇది కూడా చదవండి : California: హిమపాతం దెబ్బకు అమెరికా అతలాకుతలం.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన గవర్నర్‌

ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం..
కృష్ణా ప్టాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పడం అంటే ఆంధ్రాకు అప్పజెప్పడమేనంటూ విమర్శలు గుప్పించారు. ఆంధ్రా కోరుకున్నది ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ఒక్కటేనని, పూర్తి చేసుకున్న పాత ప్రాజెక్టులు ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య, కేంద్రం ట్రిబ్యునల్ ద్వారా నీటి వాటాలు ఖరారు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా నేటి హక్కులకోసం అందర్నీ కలుపుకు పోవాలని, ఈ దిశగా వత్తిడి పెంచడానికి ప్రజా క్షేత్రంలోకి పోతామన్నారు.

తాత్కాలిక ఒప్పందం..
గతంలో ఏడాది పాటు చేసుకున్న తాత్కాలిక ఒప్పందాన్ని ముందుకు తేవడం రాష్ట్ర ప్రభుత్వ అవగాహనా రాహిత్యానికి నిదర్శనమి దుయ్యబట్టారు. గజేంద్ర సింగ్ షెకావత్ మాటలు శుద్ద అబద్ధం. ఒకవేళ అదే నిజమైతే జనవరి 17 నాడు కేంద్రం ఎందుకు మీటింగ్ పెట్టింది? కేసీఆర్ ప్రభుత్వం ఒప్పుకున్నట్టుగా ఏదైనా రికార్డ్ ఉంటే కేంద్ర మంత్రి గానీ గానీ సీఎం గానీ చూయించగలరా? అని ప్రశ్నించారు.

సమ్మతి ఇవ్వలేదు..
గతoలో 22 ఆక్టోబర్ 2020 లో జరిగిన మీటింగ్ లో 27.05. 2022 మీటింగ్ లోనూ సమ్మతి ఇవ్వలేదు. అన్ని మినిట్స్ క్లియర్ గా ఉన్నాయని, 19.05. 2023 మీటింగ్ లో కూడా తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోలేదని క్లియర్ గా ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకే కేంద్రం ప్రయత్నిస్తుందని ఆరోపణలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద నల్లగొండ సభతో ఒత్తిడి పెంచుతామంటూ చెప్పుకొచ్చారు.

#kcr #central-government #niranjan-reddy #blackmailed
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe