Corona Cases: పెరుగుతున్న కరోనా కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు.. లాక్ డౌన్ తప్పదా?

దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కేరళ, కర్ణాటక రాష్ట్రలకు హై అలెర్ట్ ప్రకటించింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించింది. పాజిటివ్ శాంపిల్స్ ను జినోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని కోరింది.

New Update
Corona Cases: పెరుగుతున్న కరోనా కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు.. లాక్ డౌన్ తప్పదా?

Corona Cases Increasing In INDIA: దేశంలో అంతమైందని అనుకున్న కరోనా.. లేదు నేను ఉన్నాను అంటూ మళ్లీ ప్రజలపై దండయాత్రకు సిద్ధమైంది. పార్ట్-1, పార్ట్-2 సినిమాల వలె ప్రజలకు చుక్కలు చూపించింది కరోనా. కరోనా దాటికి ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు చావు దాక వెళ్లివచ్చారు. తాజాగా దేశాలను హడలెత్తించిన కరోనా మహమ్మారి మళ్లీ క్రమంగా విజృంభిస్తోంది. మన దేశంలో తాజాగా 335 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ సోకిన ఐదుగురు మృతి చెందారు. ఒక్క కేరళలోనే (Kerala) నలుగురు చనిపోగా, యూపీలో మరొకరు మరణించారువీరంతా కొత్త వేరియంట్ జేఎన్ 1 వైరస్లో మృతి చెందడంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు.

ALSO READ: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఆరు గ్యారెంటీలపై అప్డేట్

కాగా, భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,701కి చేరింది. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు 4,50,04,816 మందికి కరోనా (Corona Virus) సోకింది. రికవరీ రేటు 98.91 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా కారణంగా దేశంలో ఇప్పటివరకు 5,33,316 మంది చనిపోయారు. దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల డోస్ కొవిడ్ వ్యాక్సిన్ (Covid Vaccine) ఇచ్చినట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది.

రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

కొవిడ్ (Covid) విజృంభణతో రాష్ట్రాలు అలర్ట్ గా ఉండాలని కేంద్రం సూచించింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించింది. పాజిటివ్ శాంపిల్స్ ను జినోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని కోరింది. కరోనా కట్టడికి తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా కేరళ , కర్ణాటక రాష్ట్రాలకు హైఅలెర్ట్ ప్రకటించింది. తాజాగా కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి 60 ఇండ్లు దాటిన వారు తప్పకుండా మాస్కులు ధరించాలని సూచించారు.

ALSO READ: పార్లమెంట్ ఎన్నికలు.. నేడు ఇండియా కూటమి భేటీ

దేశంలో లాక్ డౌన్ అమలు..

దేశంలో మరోసారి కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో దేశ ప్రజల్లో ఆందోళన మొదలైంది. సోషల్ మీడియా వేదికగా చర్చలు చేస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో మరోసారి లాక్ డౌన్ (Lock Down) అమలు చేస్తారని ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు కరోనా వస్తే తాము హాయిగా ఇంటి నుంచే వర్క్ చేసుకోవచ్చని కామెంట్లు చేస్తున్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ అధికారిక శాఖ దేశంలో లాక్ డౌన్ అమలు చేయడం లేదని పేర్కొంది. అదిఅంతా తప్పుడు ప్రచారం అని కొట్టి పారేసింది. కరోనా బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Advertisment
తాజా కథనాలు