Indian Air Force : ఇండియన్ ఎయిర్ ఫోర్స్(Indian Air Force) లో పనిచేయడం మీ కలా అయితే ఈ ఉద్యోగాలు మీకోసమే. తాజాగా కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి జాబ్ నోటిఫికేషన్(Job Notification) ను రిలీజ్ చేసింది. అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కింద 3, 500 ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దీనికి పురుషులు, మహిళలు అందరూ అప్లై చేసుకోవచ్చునని తెలిపింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ agnipathvayu.cdac.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. జనవరి 17 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 6న ఈ గడువు ముగుస్తుంది.
Also read : ఆకాశంలో ఉండగానే ఊడిపోయిన విమానం డోర్..ప్రయాణికులు ఎలా వణికారో చూడండి…
వయోపరిమితి..
వాయుసేనలో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్(Agniveer Recruitment) కు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు 17.5 నుంచి 21 ఏళ్ళలోపు ఉండాలి. అంటే 2004 జనవరి 2 నుంచి 2007 జులై 2 మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చును.
ఎలా చేసుకోవాలి...
ముందుగా అగ్నిపథ్ అధికారిక పోర్టల్ agnipathvayu.cdac.in ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలోని ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేస్తే నోటిఫికేషన్ కనిపిస్తుంది. దాంట్లో అప్లై నౌ అనే ఆప్షన్ క్లిక్ చేసి అప్లై చేయాలి. అందులో ముందుగా వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. ఆ తరువాత రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేసి అన్ని వివరాలను ఎంటర్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.చివరగా అప్లికేషన్ ఫీజు 550రూ. చెల్లించి...అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయాలి.
క్వాలిఫికేషన్స్..
ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ తప్పనిసరి సబ్జెక్ట్‌లుగా ఉండాలి. ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. లేదా ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. డిప్లొమాలో కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లో 50 శాతం స్కోర్ చేసి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి రెండేళ్ళ ఒకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. నాన్ ఓకేషనల్ సబ్జెక్ట్స్‌గా ఫిజిక్స్, మ్యాథ్స్ చదివి ఉండాలి. సైన్స్ సబ్జెక్ట్స్ కాకుండా కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ పాసై ఉండాలి. ఇంగ్లీషు సబ్జెక్ట్‌లో తప్పనిసరిగా 50 శాతం స్కోర్ చేసి ఉండాలి. లేదా కనీసం 50 శాతం మార్కులతో రెండేళ్ల ఒకేషనల్ కోర్సు చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక, జీతాలు...
ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలకు(Air Force Jobs) ఎంపిక ఆరు దశలుగా ఉంటుంది. ఇందులో మొదటిది ఆన్‌లైన్ రాత పరీక్ష(Online Exam). ఇందులో సెలెక్ట్ అయితే సెంట్రల్ ఎయిర్‌మెన్ సెలక్షన్ బోర్డ్ టెస్ట్ ఉంటుంది. అది కూడా అయ్యాక ఫిజికల్ ఎఫిషియోన్సీ టెస్ట్, నాలుగో దశలో అడాప్టబిలిటీ టెస్ట్-1, టెస్ట్-2 ఉంటుంది. ఐదు, ఆరో దశల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక ఉద్యోగం వచ్చిన తర్వాత అభ్యర్ధులకు మొదటి ఏడాది జీతం నెలకు రూ.30,000, రెండో ఏడాదిలో రూ.33,000, మూడో ఏడాదిలో రూ.36,500, నాలుగో ఏడాదిలో రూ.40,000 జీతం లభిస్తుంది.