Electoral Bonds: అధికారిక వెబ్‌సైట్‌లో ఒక రోజు ముందుగానే ఎలక్టోరల్ బాండ్ వివరాలు.. టెన్షన్ లో పార్టీలు!

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పూర్తి బాండ్ల వివరాలను అధికారిక వెబ్ సైట్ https://www.eci.gov.in/candidate-politicalparty లో ఉంచినట్లు తెలిపింది.

New Update
Electoral Bonds: అధికారిక వెబ్‌సైట్‌లో ఒక రోజు ముందుగానే ఎలక్టోరల్ బాండ్ వివరాలు.. టెన్షన్ లో పార్టీలు!

SBI Electoral Bonds Data Released: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పూర్తి బాండ్ల వివరాలను అధికారిక వెబ్ సైట్ https://www.eci.gov.in/candidate-politicalparty ఉంచినట్లు తెలిపింది. మొత్తం ఇందులో 763 పేజీల్లో వివరాలు ఉన్నట్లు పేర్కొంది. అలాగే ఎలక్టోరల్ బాండ్ల వివరాల వెల్లడిలో పాదర్శకంగా ఉన్నట్లు ఈసీ తెలిపింది.

ఈ మేరకు 2019 నుంచి 2024 వ‌ర‌కు సుమారు 22,217 ఎల‌క్టోర‌ల్ బాండ్లను జారీ చేసిన‌ట్లు SBI వెల్లడించింది. అలాగే కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి బాండ్ల డేటాను పెన్‌డ్రైవ్‌ రూపంలో స‌మ‌ర్పించిన‌ట్లు న్యాయస్థానికి తెలిపింది. 2 పీడీఎఫ్ ఫైళ్ల రూపంలో పాస్‌వ‌ర్డ్ ప్రొటెక్షన్‌తో కూడా సమర్పించినట్లు స్పష్టం చేసింది. ఇక మార్చి 15 సాయంత్రం 5 గంటల వరకూ ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచాలని ఎన్నికల కమిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఇక బాండ్ల వివరాలను వెల్లడించేందుకు మరింత సమయం కావాలంటూ SBI చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) ఎలక్టోరల్ బాండ్ల కేసులో సమ్మతి(Compliance) అఫిడవిట్ దాఖలు చేసింది. ఎలక్టోరల్ బాండ్ కొనుగోలుదారుల పేర్లను నిర్దిష్ట రాజకీయ పార్టీలతో సరిపోల్చాల్సిన అవసరం లేదని ఎస్‌బీఐకి సుప్రీంకోర్టు తెలిపింది. మార్చి 12 సాయంత్రం 5 గంటలకు కోర్టు విధించిన గడువు ముగిసింది. ఏప్రిల్ 14, 2019 నుంచి ఫిబ్రవరి 15, 2024 వరకు కొనుగోలు చేసిన, రీడీమ్ చేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కోర్టుకు సమర్పించింది. SBI ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు, ఎన్‌క్యాష్‌మెంట్ తేదీ వివరాలు, విరాళాలు, పేర్లను స్వీకరించిన రాజకీయ పార్టీల పేర్లను తెలిపింది. కొనుగోలుదారులు, వారి డినామినేషన్లు ఎన్నికల కమిషన్‌కు అందించింది. 

పాస్‌వర్డ్-రక్షిత రెండు PDF ఫైల్‌లలో డేటా కంపైల్ చేశారు. ఈ పాస్‌వర్డ్‌లను పెన్ డ్రైవ్‌ ద్వారా ఎన్వలప్‌ చేశారు. మొత్తం 22,217 ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయగా, వాటిలో 22,030 రాజకీయ పార్టీలు రీడీమ్ చేశాయి. ఏప్రిల్ 1-11, 2019 మధ్య.. మొత్తం 3,346 ఎలక్టోరల్ బాండ్‌లు కొనుగోలు చేశారు. వాటిలో 1,609 రీడీమ్ చేశారు. ఏప్రిల్ 12, 2019 నుంచి ఫిబ్రవరి 15, 2024 వరకు, మొత్తం 18,871 ఎలక్టోరల్ బాండ్‌లు కొనుగోలు చేయగా అందులో 20,421 రీడీమ్ అయ్యాయి.

Also Read : ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గింది.. కానీ..

అసలేం జరిగింది?
ఎలక్టోరల్ బాండ్స్ (Elerctoral Bonds Issue)విషయంలో సుప్రీం కోర్టు విస్పష్ట తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. బాండ్స్ తీసుకున్నవారి వివరాలు వెల్లడించాలని ఆ తీర్పులో ఎస్బీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే ఎలక్టోరల్ బాండ్ల వివరాలను భారత ఎన్నికల కమిషన్‌కు సమర్పించడానికి జూన్ 30 వరకు వ్యవధి ఇవ్వాలని కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే SBI సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతంలో సుప్రీంకోర్టు మార్చి 6వ తేదీలోగా (Elerctoral Bonds Issue)వివరాలను సమర్పించాలని ఎస్‌బీఐని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎలక్టోరల్ బాండ్‌లను డీకోడింగ్ చేయడం , దాతల విరాళాలతో సరిపోల్చడం సంక్లిష్టమైన ప్రక్రియ అని SBI ఆ పిటిషన్ లో పేర్కొంది. అందుకోసం మరింత సమయం కావాలని ఎస్బీఐ అభ్యర్ధించగా.. ఈ పిటిషన్ పై సుప్రీం కోర్టులో సోమవారం (మార్చి 11న) సుప్రీం కోర్టు ప్రధాన నయయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. మార్చి 12 తేదీ (అంటే మంగళవారం) సాయంత్రం లోగా దాతల వివరాలు ఈసీకి అందచేయాల్సిందే అని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జరీ చేసింది. తరువాత వాటిని వెబ్ సైట్ లో ఈ నెల 15 లోగా అప్ డేట్ చేయాలని ఈసీకి సూచించింది సుప్రీం కోర్టు ధర్మాసనం.

Advertisment
తాజా కథనాలు