తెలంగాణలో ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఏజెన్సీ(సమస్యాత్మక) ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ మొదలైన దగ్గర నుంచీ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాజకీయనాయకులు, ప్రముఖులు కూడా ఉదయం నుంచే పోలింగ్ బూతులకు తరలివస్తున్నారు. ఇప్పటి వరకు చాలా మందే తెలుగు సినీ తారలు ఓటేసి వెళ్ళారు.
Also read:కావాలనే నాగార్జున సాగర్ వివాదం సృష్టించారు-రేవంత్ రెడ్డి
హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లా పరిధిలో ప్రశాంతంగా పోలింగ్ మొదలైంది. ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. కాంగ్రెస్ నేత పొంగులేటి సైతం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం జిల్లాలోని నారాయణపురంలో ఆయన ఓటు వేశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బంజారాహిల్స్ లో కవిత, జూబ్లీ హిల్స్ లో అల్లు అర్జున్, చిరంజీవి దంపతులు, కీరవాణి కుటుంబం ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే జూ. ఎన్టీయార్ కూడా తన తల్లి, భార్యతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇక మరో హీరోలు సుమంత్, మణికొండలో వెంకటేష్ లు ఓటు వేశారు. కేంద్రమంత్రి, స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి బర్కత్‌పురాలోని పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. షేక పేట్ ఇంటర్నేషనల్ స్కూల్లో రాజమౌళి దంపతులు ఓటు వేశారు. జూబ్లీ హిల్స్ క్లబ్ లో హీరో నితిన్ కూడా తన ఓటును నమోదు చేశారు.