నాలుగు రోజులు..ఆరు ప్రాజెక్టులు..నాలుగు రోడ్డుషోలు..రెండు బహిరంగ సభలు!

ఏపీలో రాజకీయాలు వేడివేడిగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం నుంచి గురువారం వరకు రాష్ట్రంలో చంద్రబాబు పర్యటన పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు పరిశీలించేందుకు

New Update
నాలుగు రోజులు..ఆరు ప్రాజెక్టులు..నాలుగు రోడ్డుషోలు..రెండు బహిరంగ సభలు!

ఏపీలో రాజకీయాలు వేడివేడిగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం నుంచి గురువారం వరకు రాష్ట్రంలో చంద్రబాబు పర్యటన పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు పరిశీలించేందుకు చంద్రబాబు సిద్దమయ్యారు. ఈ సందర్భంగా రోడ్డు షోలు, బహిరంగ సభలు కూడా నిర్వహించబోతున్నారు.

మొత్తానికి నాలుగు రోజుల్లో ఆరు ప్రాజెక్టులను, నాలుగు రోడ్డు షోలు, రెండు బహిరంగసభలను చంద్రబాబు ఏర్పాటు చేయనున్నారు.
పేరుకి, పర్మిషన్‌ కి రాయలసీమ ప్రాజెక్ట్‌ సందర్శనే అయినప్పటికీ ప్రస్తుతానికి ఆయన కర్నూలు, కడప జిల్లాలను మాత్రమే ఆయన సందర్శిస్తారు.

చిత్తూరు, అనంతపురం జిల్లాల పర్యటన తరువాత పెట్టుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరులోని బనకచర్ల, ముచ్చుమర్రి ప్రాజెక్టులను సందర్శిస్తారు. తరువాత నందికొట్కూరులో రోడ్డు షో, బహిరంగ సభలో పాల్గొంటారు. దీనితో పాటు కొన్ని రిజర్వాయర్లను కూడా ఆయన పరిశీలిస్తారు.

బుధవారం సాయంత్రానికి కడపలోని జమ్మలమడుగుకి చేరుకుంటారు. అక్కడ కొండాపురం దగ్గరున్న గండికోట ప్రాజెక్టుతో పాటు పైడిపాలెం ఎత్తిపోతల పథకాలను పరిశీలిస్తారు. రాయలసీమలోని సాగు, తాగునీటి ప్రాజెక్టులను నిధులను ఏ విధంగా విడుదల చేసింది, ప్రాజెక్టు పనులు ఎంత వేగంగా జరిగాయనే విషయాన్ని చంద్రబాబు ప్రత్యక్షంగా పరిశీలించబోతున్నారు.

గడచిన నాలుగున్నరేళ్ళుగా సాగునీటి ప్రాజెక్టులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని నిధులను కేటాయించింది ? పనులు ఎంతమేర జరిగాయి? ఇంకా జరగాల్సిన పనుల గురించి పెద్దగా వివరించిందిలేదు. వాటిని ప్రశ్నించి ప్రజలకు తెలియజేసేందుకే చంద్రబాబు ఈ పర్యటన పెట్టుకున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు