YS Jagan : జగన్ కు షాకిచ్చిన సీబీఐ.. ఆ పర్యటన రద్దు?

ఈ నెల 17 నుంచి జూన్ 1వ తేదీ వరకు యూరప్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. అయితే.. జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోర్టును కోరింది.

New Update
YS Jagan : జగన్ కు షాకిచ్చిన సీబీఐ.. ఆ పర్యటన రద్దు?

CBI : ఏపీ సీఎం జగన్(AP CM Jagan) కు సీబీఐ షాక్ ఇచ్చింది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు యూరప్(Europe) పర్యటనకు అనుమతి కోరుతూ సీఎం జగన్ హైదరాబాద్(Hyderabad) లోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ పిటిషన్ పై సీబీఐ కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని ఈ సందర్భంగా సీబీఐ కోర్టును కోరింది. జగన్ పై ఉన్న మొత్తం 11 కేసులపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఇందులో ప్రతీ కేసులోనూ జగన్ ప్రధాన ముద్దాయిగా ఉన్నారని పేర్కొంది. మే 15న జగన్ పై ఉన్న ప్రధాన కేసు విచారణ జరగనున్నట్లు కోర్టుకు తెలిపింది సీబీఐ. ఈ నేపథ్యంలో జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం సరికాదని సీబీఐ వాదనలు వినిపించింది. తీర్పును ఈ నెల 14కు వాయిదా వేసింది న్యాయస్థానం.

Also Read : టీడీపీ నేత ఇంట్లో భారీగా సొమ్ము స్వాధీనం.. అధికారి లెక్కలపై అనుమానాలు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు