Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) అవినీతిపై అవినీతిపై రేవంత్ సర్కార్(Revanth Sarkar) గట్టిగానే ద్రుష్టి పెట్టింది. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ(Telangana) ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఈ చర్యలు చేపట్టింది. జలసౌధలోని తెలంగాణ ఇరిగేషన్ శాఖ కార్యాలయానికి విజిలెన్స్ అధికారులు తనిఖీలు కూడా చేశారు.ఇప్పడు ఈ ప్రాజెక్టు లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టేందుకు సిద్ధంగాఉన్నామని సిబిఐ కీలక వ్యాఖ్యలు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం కానీ, కోర్టులు కానీ ఆదేశిస్తేనే దర్యాప్తు
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ(CBI) తో దర్యాప్తు చేయించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై సీబీఐ అభిప్రాయాన్నిహైకోర్టు అడిగింది.విచారణకు సిద్ధంగా ఉన్నానని , మానవ వనరులు, మౌలిక సదుపాయాలు కల్పించేలా రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించాలని సీబీఐ అధికారులు కోరారు. అదనపు ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, ఆరుగురు ఇన్సెపెక్టర్లు,4 ఎస్సైలతో పాటు సిబ్బంది కావాలని కోరారు.ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం లేదా కోర్టులు ఆదేశిస్తేనే..దర్యాప్తు చేయగలమని సీబీఐ సీబీఐ కౌంటర్లో పేర్కొంది. అనంతరం పిటిషన్‌పై విచారణను వచ్చేనెల 2కు కోర్టు వాయిదా వేసింది.
Also Read : Budget 2024-25: బడ్జెట్లో ఉద్యోగులకు వరాల జల్లులు..ఈసారి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా.?
విమర్శల వెల్లువ
తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ వంతెన కుంగిపోవడం దుమారం లేపింది. బ్యారేజీలోని బీ బ్లాక్ పరిధిలో గల 18,19, 20, 21 పిల్లర్ల వద్ద బ్ఈయారేజీ వంతెన కుంగింది. మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగడంపై అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోశాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం కోట్లు ఖర్చుపెట్టామని చెప్పి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మించారని ఆరోపించారు. అప్పట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కుంగిన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. అప్పటి బీఆర్‌ఎస్ సర్కార్(BRS Sarkar) పై విమర్శలు చేశారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మేడిగడ్డకు సంబంధించి పూర్తి వివరాలను నీటిపారుదల శాఖ అధికారులు అందజేశారు. ఇటీవలే మంత్రులు కూడా మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు.
మెఘా కృష్ణారెడ్డిపై అవినీతి ఆరోపణలు
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మేఘా కంపెనీ(Megha Company) 40 వేల కోట్లకు పైగా అవినీతికి పాల్పడిందని బీజేపీ నేతలతో పాటు ఇతర సంస్థలు ఆరోపిస్తున్నారు. దీనిపై సీబీఐ విచారణ చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ పై విజిలెన్స్ విచారణ నేపథ్యంలో మెఘా కంపెనీ, దాని ఓనర్ మెఘా కృష్ణారెడ్డి అవినీతి కూడా బయటకు వచ్చే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.
ALSO READ : కాంగ్రెస్‌కి బీజేపీ జాకీలు పెట్టింది.. కేటీఆర్ పంచులు!