Andhra Pradesh: సీఎం జగన్‌ పథకాలపై జేడీ లక్ష్మీనారాయణ పొగడ్తల వర్షం.. ఫుల్ ఖుషీలో వైసీపీ ఫ్యాన్స్‌..

జగన్‌ పరిపాలనపై ప్రశంసల వర్షం కురిపించారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. నాడు – నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు చాలా అందంగా ముస్తాబయ్యాయని కొనియాడారు. అంగన్వాడీలలో చిన్నపిల్లలకు పౌష్టికాహారం, రాగిజావ ఇవ్వడంపై ప్రశంసలు కురిపించారు. జగనన్న ఆరోగ్య సురక్ష మంచి ప్రోగ్రామ్ అని కొనియాడారు. బాధితుల దగ్గరకే డాక్టర్లు వెళ్లి పరీక్షలు చేయడం.. మందులు ఇవ్వడం మంచి పరిణామం అన్నారు. ఎవరైతే విద్యా, వైద్య రంగాలలో మంచి పనులు చేస్తారో వారికి అంతే స్థాయిలో ఫలితం కూడా ఉంటుందని అన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.

New Update
NEET Paper Leak : నీట్ పేప‌ర్ లీక్ ఆరోపణలపై .. సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ ఆస‌క్తిక‌ర ట్వీట్‌!

Andhra Pradesh:సీఎం జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ(Lakshmi Narayana). శ్రీశైలంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీనారాయణ.. సీఎం జగన్‌(CM YS Jagan) పాలనపై ప్రశంసలు కురిపించారు. విద్య, వైద్య రంగాల్లో మంచి చేసేవారికి మంచి ఫలితం ఉంటుందన్న లక్ష్మీనారాయణ.. నాడు-నేడు, జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలను ప్రశంసించారు.

సందర్భం ఏంటంటే..

తాను చదువుకున్న పాఠశాల పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొనేందుకు లక్ష్మీనారాయణ శ్రీశైలం వెళ్లారు. అయితే, వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కూడా శ్రీశైలంలోనే ఉన్నారని తెలుసుకున్న లక్ష్మీనారాయణ.. పూర్వ విద్యార్థుల సమావేశానికి ఆయన్ను ఆహ్వానించేందుకు వెళ్లారు. అదే సమయంలో జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం జరుగుతోంది. లక్ష్మీనారాయణను చూసిన వెంటనే ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి స్టేజి మీదికి ఆయన్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. జగన్‌ పరిపాలనపైన ప్రశంసల వర్షం కురిపించారు. నాడు – నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు చాలా అందంగా ముస్తాబయ్యాయని కొనియాడారు. అంగన్వాడీలలో చిన్నపిల్లలకు పౌష్టికాహారం, రాగిజావ ఇవ్వడంపై ప్రశంసలు కురిపించారు. జగనన్న ఆరోగ్య సురక్ష మంచి ప్రోగ్రామ్ అని కొనియాడారు. బాధితుల దగ్గరకే డాక్టర్లు వెళ్లి పరీక్షలు చేయడం.. మందులు ఇవ్వడం మంచి పరిణామం అన్నారు. ఎవరైతే విద్యా, వైద్య రంగాలలో మంచి పనులు చేస్తారో వారికి అంతే స్థాయిలో ఫలితం కూడా ఉంటుందని అన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.

వైసీపీ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ..

సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వివిధ కేసులలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్‌ను అరెస్ట్‌ చేసిన లక్ష్మీనారాయణ.. అదే జగన్ పరిపాలనను అభినందించడం, ప్రశంసల జల్లు కురిపించడం పట్ల వైసీపీ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. జగన్‌ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పొగుడుతూ లక్ష్మీనారాయణ చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసేస్తున్నారు.

Also Read:

ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీటిని తాగితే 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..

పదవి విరమణ తరువాత నెలవారీగా పెన్షన్ పొందాలనుకుంటున్నారా? ఈ పథకం బెస్ట్!

Advertisment
తాజా కథనాలు