ఇటీవల ఆర్టీవీ వేల కోట్ల ఫేక్ బ్యాంక్ గ్యారెంటీ స్కామ్ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్ పరిశోధనలోకి ఎట్టకేలకు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ప్రవేశించింది. ఆర్టీవీ వార్తలను చూసి స్పందించిన ఎంపీ కార్తీ చిదంబరం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కి లేఖ రాశారు. దీంతో ఈ భారీ స్కామ్‌పై విచారణ చేపట్టి దోషులను పట్టుకోవాలని CBIని RBI ఆదేశించింది. దీంతో ఇలాంటి భారీ స్కామ్ వార్తను బయటకు రాకుండా చూడాలని ప్రయత్నించిన వారికి బిగ్ షాక్ తగిలినట్లయింది. ఈ స్కామ్ సూత్రధారులు, పాత్రధారులు ఇప్పుడు ఒక్కొక్కరుగా త్వరలోనే CBI ముందుకు రాబోతున్నారు. ఈ ఫేక్ గ్యారెంటీ స్కామ్‌లో SBI పాత్రను బహిర్గతం చేసే ఫోన్ వివరాలు ప్రస్తుతం ఆర్టీవీ దగ్గర ఉన్నాయి. వేల కోట్ల నకిలీ విదేశీ బ్యాంకు గ్యారెంటీల కుంభకోణానికి హైదరాబాద్ కేంద్రంగా మారింది. ఫేక్ బ్యాంక్ గ్యారెంటీలు హైదరాబాద్‌లోనే తయారవ్వగా.. దీని ప్రధాన కార్యాలయం SBI సికింద్రాబాద్ బ్రాంచ్ కావడం ఆసక్తిని రేపుతోంది.
పూర్తిగా చదవండి..MEIL Scam: RTV ‘ఆపరేషన్ దేశద్రోహం..’ ‘మేఘా’ పైకి సీబీ’ఐ’!
ఆర్టీవీ వెలుగులోకి తెచ్చిన వేల కోట్ల ఫేక్ బ్యాంక్ గ్యారెంటీ స్కామ్ పరిశోధనలోకి ఎట్టకేలకు CBI ప్రవేశించింది. ఈ వార్తలను చూసి స్పందించిన ఎంపీ కార్తీ చిదంబరం RBIకి లేఖ రాశారు. దీంతో ఈ భారీ స్కామ్‌పై విచారణ చేపట్టి దోషులను పట్టుకోవాలని CBIని RBI కోరింది.
Translate this News: