MEIL Scam: RTV 'ఆపరేషన్ దేశద్రోహం..' 'మేఘా' పైకి సీబీ'ఐ'!

ఆర్టీవీ వెలుగులోకి తెచ్చిన వేల కోట్ల ఫేక్‌ బ్యాంక్‌ గ్యారెంటీ స్కామ్‌ పరిశోధనలోకి ఎట్టకేలకు CBI ప్రవేశించింది. ఈ వార్తలను చూసి స్పందించిన ఎంపీ కార్తీ చిదంబరం RBIకి లేఖ రాశారు. దీంతో ఈ భారీ స్కామ్‌పై విచారణ చేపట్టి దోషులను పట్టుకోవాలని CBIని RBI కోరింది.

New Update
MEIL Scam: RTV 'ఆపరేషన్ దేశద్రోహం..' 'మేఘా' పైకి సీబీ'ఐ'!

ఇటీవల ఆర్టీవీ వేల కోట్ల ఫేక్‌ బ్యాంక్‌ గ్యారెంటీ స్కామ్‌ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్‌ పరిశోధనలోకి ఎట్టకేలకు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ప్రవేశించింది. ఆర్టీవీ వార్తలను చూసి స్పందించిన ఎంపీ కార్తీ చిదంబరం రిజర్వు బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (RBI)కి లేఖ రాశారు. దీంతో ఈ భారీ స్కామ్‌పై విచారణ చేపట్టి దోషులను పట్టుకోవాలని CBIని RBI ఆదేశించింది. దీంతో ఇలాంటి భారీ స్కామ్‌ వార్తను బయటకు రాకుండా చూడాలని ప్రయత్నించిన వారికి బిగ్‌ షాక్ తగిలినట్లయింది. ఈ స్కామ్‌ సూత్రధారులు, పాత్రధారులు ఇప్పుడు ఒక్కొక్కరుగా త్వరలోనే CBI ముందుకు రాబోతున్నారు. ఈ ఫేక్‌ గ్యారెంటీ స్కామ్‌లో SBI పాత్రను బహిర్గతం చేసే ఫోన్‌ వివరాలు ప్రస్తుతం ఆర్టీవీ దగ్గర ఉన్నాయి. వేల కోట్ల నకిలీ విదేశీ బ్యాంకు గ్యారెంటీల కుంభకోణానికి హైదరాబాద్‌ కేంద్రంగా మారింది. ఫేక్‌ బ్యాంక్‌ గ్యారెంటీలు హైదరాబాద్‌లోనే తయారవ్వగా.. దీని ప్రధాన కార్యాలయం SBI సికింద్రాబాద్‌ బ్రాంచ్‌ కావడం ఆసక్తిని రేపుతోంది.publive-image

ఇక భారత్‌కు వేల కిలోమీటర్ల దూరంలో సెయింట్ లూసియా అనే చిన్న ద్వీప దేశం ఉంది. ఈ దేశంలో, యూరో ఎగ్జిమ్ బ్యాంక్ (Euro Exim Bank) తన సొంత బ్యాంక్ గ్యారెంటీని ఇస్తుంది. ఆ తర్వాత దానిని ఆఫ్రికన్ దేశం టాంజానియాలో ఉన్న ఎగ్జిమ్ బ్యాంక్ కు పంపుతుంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత హైదరాబాద్ లోని SBI దానిని ప్రామాణికం చేసి MMRDA లాంటి ప్రభుత్వ సంస్థలకు పంపుతుంది. ఇదే ఎగ్జిమ్‌ బ్యాంక్‌ దుబాయ్‌లోని మష్రెక్ బ్యాంక్‌కు, మారిషస్‌లోని మారిషస్ వాణిజ్య బ్యాంకుకు కూడా గ్యారెంటీలు పంపుతుంది. తర్వాత లేఖల్ని SBI, UBI తమ అథెంటిసిటీ లెటర్స్‌తో ప్రభుత్వ ఏజెన్సీలకు పంపి అవినీతికి రాజముద్ర వేస్తున్నాయి. ఈ స్కామ్‌లో ఒకటి రెండు కాదు.. మొత్తం 7 దేశీ, విదేశీ బ్యాంకులు ఉన్నాయి.

publive-image

ఇక్కడ మరో విషయం ఏంటంటే యూరో ఎగ్జిమ్‌ బ్యాంక్ గ్యారెంటీ డబ్బును స్వయంగా చెల్లించదు. ఈ బాధ్యతలను యుగాండాలోని ఎగ్జిమ్‌ బ్యాంకుకు అప్పగిస్తుంది. యుగాండాలోని ఎగ్జిమ్ బ్యాంక్ విలువ 19 మిలియన్ డాలర్లు. కానీ ఈ డాక్యుమెంట్‌లో జారీ చేసిన బ్యాంక్ గ్యారెంటీ 123 మిలియన్ డాలర్లు. అంటే బ్యాంకు ఇచ్చిన గ్యారెంటీ.. ఆ బ్యాంకు సామర్థ్యం కంటే 104 మిలియన్ డాలర్లు ఎక్కువ. ఇంకా ఇలాంటి ఫేక్‌ గ్యారెంటీలు ఇస్తూ జనం సొమ్మును కాంట్రాక్టర్లు దోచేస్తున్నారు. దేశంలో ప్రభుత్వం ప్రజల సొమ్ముతో వంతెనలు, రోడ్లు, టన్నెల్స్‌ లాంటివి నిర్మిస్తుంది. వాటిని నిర్మించడానికి ప్రైవేట్ కంపెనీలకు కాంట్రాక్ట్‌లు ఇస్తుంది. అయితే ఆ కంపెనీలు జనం డబ్బును దోచుకోవడానికి ఫేక్‌ డాక్యుమెంట్లు సమర్పిస్తున్నాయి. మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ... యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా యూరో ఎగ్జిమ్ బ్యాంకు నుంచి నేషనల్ హైవే అథారిటీకి అలాంటి నకిలీ బ్యాంక్ గ్యారెంటీని ఇచ్చింది.

publive-image

ఆ మేఘా కంపెనీ (Megha Company) నిర్మించిన రోడ్డు నిర్మాణంలో ఇటీవల నాణ్యత లోపాలు బయటపడ్డాయి. NH-17లో భాగంగా కేరళలోని చెంగాల నుంచి నీలేశ్వరం రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపాలపై మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ఎండీ కృష్ణారెడ్డికి షోకాజ్ నోటీసు జారీ అయింది. అయితే ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేసి చేతులు దులిపేసుకున్నారు. ఇక తాజాగా తెలంగాణలో మేఘా ఇంజినీరింగ్ (Meil) చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టులో ప్రహారీ గోడ కుప్పకూలింది. నాసిరకంగా, అత్యంత నిర్లక్ష్యంగా నిర్మించిన ఈ టన్నెల్‌ వాల్‌ చిన్న వరదకే పేకమేడలా కూలిపోయింది. ఇక భారీ వరద వస్తే సుంకిశాల (Sunkishala Project) కృష్ణలో కలిసిపోయే పరిస్థితి కనిపిస్తోంది. కాళేశ్వరం పంప్‌హౌస్‌ మునగడంలోనూ మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ వైఫ్యలం ఉంది.

publive-image

publive-image

ఈ అవినీతి బాగోతంలో భాగమైన చాలా మంది IAS అధికారులకు నిద్రపట్టడం లేదు. ఫేక్‌ డాక్యుమెంట్లతో దొంగ కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెడుతున్న ఈ ఐఏఎస్ అధికారులు CBI విచారణను ఎదుర్కోబోతున్నారు. అడ్డదారుల్లో వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చినందుకు ఈ అధికారులు ఎంత లంచాలు తీసుకున్నారో బయటపడబోతోంది. కాంట్రాక్టర్లు ఓ వింత వాదన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ వ్యవస్థ చేతకానితనం మీద అపారమైన నమ్మకంతో ఫేక్‌ బ్యాంక్‌ గ్యారెంటీలు ఇచ్చామని, అవకాశమిస్తే ఆ గ్యారెంటీలను మార్చి మంచి గ్యారెంటీలు ఇస్తామని చెబుతున్నారు. దేశంలోనే ఉండి దోచుకుంటున్న ద్రోహుల నుంచి ప్రజల్ని ఎవరు కాపాడాలి ?. దేశంలో తిష్టవేసి మోసాలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్లు లంచాలతో నేతల్ని కీలు బొమ్మలు చేసి ఆడిస్తున్నారు. CBI జోక్యం వ్యవస్థలపై నమ్మకం నిలబడటానికి ఎంతో కొంత ఉపయోగపడుతుందని ప్రజలు భావిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు