PAN CARD: షాకింగ్ న్యూస్.. 11.5 కోట్ల పాన్ కార్డులు రద్దు.. ఎందుకో తెలుసా?

ఆధార్‌-పాన్‌ లింక్‌ చేయని వారి పాన్‌కార్డులును రద్దు చేశారు. 11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టివేట్ అయ్యాయి. రూ.1,000 జరిమానా చెల్లించడం ద్వారా ఈ కార్డులను మళ్లీ రీ-యాక్టివేట్ చేసుకోవచ్చని అధికారులు చెప్పారు.

PAN CARD: షాకింగ్ న్యూస్.. 11.5 కోట్ల పాన్ కార్డులు రద్దు.. ఎందుకో తెలుసా?
New Update

PAN Cards Deactivated: మీరు పాన్‌(PAN)- ఆధార్‌(AADHAR) లింక్‌ చేసుకోలేదా? లేకపోతే మీ కుటుంబసభ్యుల్లో ఎవరైనా లింక్ చేసుకోలేదా? లింక్‌ చేసుకోమని ఎన్నిసార్లు చెప్పినా వినలేదా..? ఇక లైట్‌ తీసుకోండి.. అధికారులు వారి పాన్‌కార్డును డీయాక్టివేట్ చేసేశారు..! ఇప్పటికీ అనేకసార్లు పాన్‌-ఆధార్‌ కార్డు లింక్‌కు డెడ్‌లైన్‌ పొడిగిస్తూ వచ్చారు. ఆదాయపు పన్ను నిబంధన ప్రకారం, పాన్, ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి. ఆధార్-పాన్ లింక్ చేయడానికి జూన్ 30, 2023 లాస్ట్ డేట్. ఈ తేదీ ఇప్పటికే ముగిసింది. ఇది పలుమార్లు పొడిగించిన తర్వాత లాస్ట్ డెడ్‌ లైన్‌. ఆధార్‌-పాన్‌ లింక్‌ అవ్వని మొత్తం 11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టివేట్ అయ్యాయి.

ఇంకా ఛాన్స్‌ ఉంది:

ఇప్పటికే ఎన్నోసార్లు అధికారులు చెప్పినా, డెడ్‌లైన్‌ పొడిగించినా పాన్‌-ఆధార్‌ లింక్‌ చేయని పాన్‌కార్డులను (Pan Cards) రద్దు చేసిన అధికారులు మరో అవకాశం ఇచ్చారు. రూ.1,000 జరిమానా చెల్లించడం ద్వారా ఈ కార్డులను మళ్లీ రీ-యాక్టివేట్ చేయవచ్చని చెప్పారు. సమాచార హక్కు (ఆర్‌టీఐ) అభ్యర్థనకు రిప్లై ఇస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఈ మేరకు క్లారిటీ ఇచ్చింది. మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్ర శేఖర్‌కు ఈ ఆన్సర్ ఇచ్చింది. దేశంలో 70.24 కోట్ల మంది పాన్ కార్డ్ హోల్డర్లలో, 57.25 కోట్ల మంది తమ పాన్ కార్డులను ఆధార్‌తో లంక్‌ చేశారు. 12 కోట్లకు పైగా పాన్ కార్డ్‌లను ఇంకా లింక్ చేయలేదు. వీటిలో 11.5 కోట్ల కార్డులను ఇప్పటికే డీయాక్టివేట్ చేశామని CBDT సమాధానం చెప్పింది.

పాన్-ఆధార్ లింకింగ్ స్థితిని ఎలా తనిఖీ చేయాలో చెక్ చేసుకోండి.

① అధికారిక ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌ను ఓపెన్ చేయండి --> ( www.incometax.gov.in/iec/foportal/ )

② ఎడమ వైపున, హోమ్‌పేజీలో 'లింక్ ఆధార్ స్టేటస్'పై క్లిక్ చేయండి.

③ ఇప్పుడు మీ పాన్ నంబర్ - ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.

④ తర్వాత వ్యూ లింక్‌ ఆధార్‌ స్టేటస్‌( 'View Link Aadhaar Status' )పై క్లిక్ చేయండి.

ఒకవేళ లింక్‌ చేసి ఉండకపోతే తప్పనిసరిగా చేసుకోండి. లేకపోతే బ్యాంకింగ్‌ ఫెలిసిటీస్‌తో పాటు ఐటీఆర్‌ ఫైలింగ్‌కు ఇబ్బందులు తప్పవు.

Also Read: దీపావళి రోజు పేలిన టీమిండియా టపాసులు.. మరిచిపోలేని జ్ఞాపకాలు..!

WATCH:

#latest-news-in-telugu #rtvlive-com #pan-card #aadhar-card
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe