Health Tips : రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోవాలి అనిపిస్తుందా? అయితే ప్రమాదంలో పడ్డట్లే..!!

మీరు రోజూ చేసే ఈ చిన్న పొరపాటు ఎసిడిటీ వల్ల వచ్చే గుండెల్లో మంటకు ప్రధాన కారణం కావచ్చు. దీని కారణం రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రిపోవడం.భోజనం చేసిన వెంటనే నిద్రిస్తే గుండెల్లో మంట, ఎసిడిటి, అన్నవాహికపై ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది.

Health Tips : రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోవాలి అనిపిస్తుందా? అయితే ప్రమాదంలో పడ్డట్లే..!!
New Update

Health Tips :  మనలో చాలా మంది రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రిస్తుంటారు. ఇంకొంతమంది అర్థరాత్రి వరకు తినరు. తిన్న వెంటనే పడుకుంటారు. మరీ ముఖ్యంగా రాత్రి తినే భోజనం లో చాలా మంది అధిక కొవ్వు ఉండే పదార్థాలు తీసుకుంటారు. మాంసాహారం, జంక్ ఫుడ్ ఇలాంటి ఎక్కువగా తింటుంటారు. ఆహారం తిన్న వెంటనే నిద్రించకుండా కాసేపు వాకింగ్ చేయాలని వైద్యులు సూచిస్తూనే ఉన్నారు.

అయినప్పటికీ చాలా మంది తమ ధోరణిని మాత్రం మార్చుకోవడం లేదు. ఫలితంగా ఎన్నో అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. మరీ ముఖ్యంగా రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రించడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్, గుండెల్లో మంట, గొంతులో ఏదో పట్టేసినట్లు అనిపించడం, సరిగ్గా నిద్రపట్టకోవడం వంటి సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. కొవ్వుతో కూడిన భోజనం తర్వాత పడుకున్నప్పుడు గుండెల్లో మంట వస్తుంది. ఇది అన్నవాహిక స్పింక్టర్ (LES)పై ఒత్తిడి తెచ్చి అనేక సమస్యలకు కారణం అవుతుంది.

గర్భిణీలు:
చాలా మంది మహిళలు గర్భధారణ సమయంలో మొదటిసారి యాసిడ్ రిఫ్లక్స్‌ను ఎదుర్కొంటారు. పెరుగుతున్న పిండం ఒత్తిడితో హార్మోన్ స్థాయిలు పెరగడం వల్ల ఇది సంభవిస్తుంది. ఇది సాధారణంగా మూడవ త్రైమాసికంలో పెరుగుతుంది, డెలివరీ తర్వాత లక్షణాలు అదృశ్యమవుతాయి.

యాసిడ్ రిఫ్లక్స్ ఫుడ్స్:
కొన్ని ఆహారాలు గ్యాస్ట్రిటిస్‌కు కారణమవుతాయి. అవి గుండెల్లో మంట లేదా యాసిడ్ రిఫ్లక్స్‌ను ప్రేరేపిస్తాయి. కాబట్టి సిట్రస్ ఫ్రూట్స్, స్పైసీ ఫుడ్స్ వంటి అసిడిక్ ఫుడ్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

ఆమ్లత్వం ఇతర లక్షణాలు:
-ఛాతీలో మంట
-ఆహారం లేదా పుల్లని ద్రవాలు తీసుకోవడం వల్ల గొంతులో నొప్పి
-ఎగువ కడుపు లేదా ఛాతీ నొప్పి
-మింగడంలో ఇబ్బంది
-మీ గొంతులో ఏదో ముద్దలా ఉన్నట్లు అనిపించడం
- దగ్గు గొంతు నొప్పి ఆస్తమా తీవ్రతరం

ఇది కూడా చదవండి:  ఇరగదీస్తున్న ఊరు పేరు భైరవకోన సాంగ్..క్రేజ్ మామూలుగా లేదు..వ్యూస్ ఎన్నో తెలుసా..?

#health-tips #lifestyle #disease #gastroesophageal
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe