SVC59 : విజయ్ దేవరకొండ సినిమాలో నటించాలని ఉందా? అయితే ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేస్కోకండి!

రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్టులో నటించే ఛాన్స్ కొత్త నటీనటులకు ఇవ్వనున్నారు. ఈమేరకు కాస్టింగ్ కాల్ పోస్టర్ విడుదల చేశారు. తమ తమ ప్రొఫైల్స్ ను [email protected]కి మెయిల్ చేయాలని చెప్పారు.

New Update
SVC59 : విజయ్ దేవరకొండ సినిమాలో నటించాలని ఉందా? అయితే ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేస్కోకండి!

Casting Call For Vijay Devarakonda New Movie : రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా రౌడీ హీరో బర్త్ డే (Birthday) రోజు ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దిల్ రాజు పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా మొదలయ్యింది. . రూరల్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం మేకర్స్ కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేశారు.

ఇలా చేయండి...

ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో నటించే అవకాశాన్ని కొత్త నటీనటులకు ఇవ్వనున్నారు. ఈమేరకు కాస్టింగ్ కాల్ (Casting Call) పోస్టర్ విడుదల చేశారు. యాక్టింగ్ వస్తే చాలు, తెలుగొస్తే సంతోషం, గోదారి యాసొత్తే ఇంకాపేవోడే లేడు.. అంటూ వవినూత్నరీతిలో ఈ ప్రకటన చేశారు. ఇందుకొసం తమ తమ ప్రొఫైల్స్ ను [email protected] కి మెయిల్ చేయాలని చెప్పారు. లేదా 91 9676843362 నంబర్ కు ప్రొఫైల్ పంపాలని తెలిపారు.

Also Read : గోపీచంద్ మలినేని సడెన్ ట్విస్ట్, రవితేజను కాదని బాలీవుడ్ హీరోతో సినిమా.. గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు!

మరి మీకు యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉంటే, గోదావరి స్లాంగ్ అనర్గళంగా మాట్లాడగలిగితే.. ఈ సినిమాలో భాగమయ్యే అవకాశాన్ని దక్కించుకోండి. ఇక ఇటీవల 'ఫ్యామిలీ స్టార్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం వైజాగ్ లో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది.

Advertisment
తాజా కథనాలు