బీజేపీలోకి క్యాసినో కింగ్.. అగ్రనేతలతో చికోటి ప్రవీణ్‌ భేటీ

క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ రాజకీయాల్లోకి రానున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ప్రవీణ్‌ తెలంగాణ బీజేపీ అగ్రనేతలను కలవడం ఇందుకు బలం చేకూరుతోంది. అయితే వరుస వివాదాల్లో ఉన్న చీకోటీని బీజేపీ పార్టీలోకి చేర్చుకుంటుందో? లేదో? ఆసక్తిగా మారింది.

New Update
బీజేపీలోకి క్యాసినో కింగ్.. అగ్రనేతలతో చికోటి ప్రవీణ్‌ భేటీ

క్యాసినో కింగ్‌గా ఫేమస్(Casino King Chikoti Praveen)..

చికోటి ప్రవీణ్(chikoti praveen) తెలుగు రాష్ట్రాల్లో క్యాసినో కింగ్‌గా ఫేమస్ అయ్యారు. ప్రముఖులను విదేశాలకు తీసుకువెళ్లి వారి చేత గ్యాంబ్లింగ్ ఆడించడంలో సిద్ధహస్తుడుగా పేరు గడించారు. రేషన్ షాపు నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేపట్టి ఆ తర్వాత గ్యాంబ్లర్ గా స్థిరపడ్డారు. ఇటీవలే థాయిలాండ్‌ పోలీసులకు కూడా పట్టుబడ్డారు. బోనాల సందర్భంగా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయానికి వచ్చిన ఆయన ప్రైవేట్ గన్‌మెన్లతో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో గన్‌మెన్ల వద్ద ఫోర్జరీ లైసెన్స్‌లు ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకున్నందుకు ఏ1 నిందితుడిగా ప్రవీణ్‌ను చేర్చారు. ఈ కేసులో అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నారు.

త్వరలోనే రాజకీయ ప్రవేశం.. 

క్యాసినోలు, గ్యాంబ్లింగ్‌లతో ఫేమస్ అయిన చికోటి ప్రవీణ్‌ రాజకీయాల్లో వచ్చేందుకు తరుచూ ప్రయత్నిస్తున్నారు. తాను రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. లాల్‌దర్వాజా మహంకాళి ఆలయంలో తానేమి హల్చల్ చేయలేదని వివరణ ఇచ్చారు. అయితే ఇన్ని వివాదాల్లో ఉన్న అతడు ఢిల్లీలో తెలంగాణకు చెందిన బీజేపీ అగ్రనేతలను కలిశారు. కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్(Bandi Sanjay).. జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జయసుధ, రామచంద్రరావు వంటి నేతలతో భేటీ అయ్యారు. దీంతో త్వరలోనే ఆయన కమలం పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. గతేడాదే బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కూడా కలిశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసేలా ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. హిందూత్వం కోసం ప్రాణమైనా ఇస్తానని తరుచూ ఇంటర్వూల్లో చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా బీజేపీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

చికోటిని విచారించిన ఈడీ అధికారులు.. 

థాయిలాండ్ క్యాసినో ఘటనపై ఈడీ అధికారులు చికోటి ప్రవీణ్‌ను విచారించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులతో కలిసి క్యాసినో నిర్వహిస్తుండటంతో థాయిలాండ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు సందర్భంగా పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు లావాదేవీలకు సంబంధించి ప్రవీణ్‌ను ఈడీ ప్రశ్నించింది. ప్రవీణ్‌తో పాటు చిట్టి దేవేందర్, మాధవరెడ్డి, సంపత్‌లకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. గతంలోనూ క్యాసినో వ్యవహారంలో మనీలాండరింగ్‌కు సంబంధించి చికోటిని ఈడీ ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో చికోటి ప్రవీణ్ వ్యవహారశైలిపై బీజేపీ నేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. అతడిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పుడు బీజేపీ అగ్రనేతలనే కలిసి పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేయడం గమనార్హం.

Also Read: ఖర్గే సమక్షంలో కండువా కప్పుకున్న జూపల్లి.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని పిలుపు!

#bandi-sanjay #bjp-party #chikoti-praveen #casino-king-chikoti-praveens-political-entry #casino-king-chikoti-praveen #chikoti-praveen-in-bjp #ts-bjp
Advertisment
Advertisment
తాజా కథనాలు