Annamalai: తమినాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై కేసు నమోదు

ఎన్నికల కోడ్ ఉల్లఘించిన నేపథ్యంలో తమినాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై కేసు నమోదు అయింది. పార్లమెంటు ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులు తమ ప్రచారాన్ని రాత్రి 10 గంటలలోపు ముగించాలని ఈసీ నిబంధన పెట్టింది. కాగా, రాత్రి సమయం 10 దాటినా అన్నామలై ప్రచారం చేశారు.

New Update
Annamalai: తమినాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై కేసు నమోదు

Case On Tamil Nadu BJP State Chief Annamalai: తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైకు షాక్ ఇచ్చారు పోలీసులు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆయనపై FIR నమోదు చేశారు. లోక్ సభ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా గురువారం అవరంపాళయం ప్రాంతంలో అనుమతించబడిన ప్రచార సమయాలను మించి ప్రచారం చేశారనే ఆరోపణలపై కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి కె అన్నామలై, కోయంబత్తూరు జిల్లా బీజేపీ కార్యదర్శి రమేష్‌లపై కేసు నమోదు చేశారు. అయితే.. పార్లమెంటు ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులు తమ ప్రచారాన్ని రాత్రి 10 గంటలలోపు ముగించాలని ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేర్కొంది. రాత్రి సమయం 10 దాటినా అన్నామలై ప్రచారం చేయడంపై పోలీసులకు ఫిర్యాదు రాగ కేసు నమోదు చేశారు.

అన్నామలైకి మద్దతుగా లోకేష్..

రానున్న లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులో మెజారిటీ పార్లమెంట్ స్థానాల్లో కాషాయ జెండా ఎగరవేయాలని వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. ఈ క్రమంలో తమిళనాడులో వరుసగా కేంద్ర మంత్రులు పర్యటిస్తున్నారు. ఇటీవల ప్రధాని మోడీ కూడా తమిళనాడులో పర్యటించారు. ఇదిలా ఉండగా.. గురువారం అవరంపాళయం అన్నామలై చేపట్టిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు టీడీపీ నేత లోకేష్. అన్నామలైకి మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. కాగా ఎన్డీయే కూటమిలో టీడీపీ భాగస్వామ్యం అయిన విషయం తెలిసిందే. ఏపీలో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకొని ఎన్నికల పోటీ చేస్తోంది.

Advertisment
తాజా కథనాలు