BRS MP Ranjith Reddy: పార్లమెంట్ ఎన్నికలు (Parliament Elections) మరి కొన్ని రోజుల్లో జరగనున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి (BRS Party) షాక్ తగిలింది. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై (Chevella BRS MP Ranjith Reddy) కేసు నమోదు చేశారు పోలీసులు. రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేసి దుర్బాషలు ఆడారని బంజారాహిల్స్ పోలీసులకు బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి (Konda Vishweshwar Reddy) ఈ నెల 20న ఫిర్యాదు చేశారు. కోర్టు అనుమతితో ఐపీసీ 504 కింద కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు (Banjara Hills Police Station).
ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లోకి 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు
అసలేమైంది..
బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజీత్‌రెడ్డి మధ్య మరోసారియుద్ధ వాతావరణం నెలకొంది. ఇద్దరు నేతలు ఫోన్ లో ఒకరిపై ఒకరు పొట్టు పొట్టు తిట్టుకున్నారు. తన మనుషులను ఎలా కలుస్తావని కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఫోన్ చేసి ఎంపీ రంజిత్ నిలదీశారట. దీంతో నీకు దమ్ము ధైర్యం ఉంటే నా వాళ్లను తీసుకువెళ్లు అని కొండా సమాధానం చెప్పినట్లు సమాచారం. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది.
పోలీసులకు ఫిర్యాదు..
ఈ నెల 20న బీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డిపై మాజీ ఎంపీ కోండా విశ్వేశ్వరరెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో రంజిత్‌రెడ్డిపై కంప్లైంట్ ఇచ్చారు. ఎంపీ రంజిత్‌రెడ్డి ఫోన్‌లో తనను భూతులు తిట్టాడని, బెదిరించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎంపీ రంజిత్ రెడ్డి నుంచి తనకు వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: ఒంటిరిగానే పోటీ చేస్తాం.. ఇండియా కూటమికి దీదీ షాక్
WATCH EXCLUSIVE STORY 'KONDA Vs RANJITH":