Bharateeyudu 2 : 'భారతీయుడు 2' పై కోర్టులో కేసు.. రిలీజ్ వాయిదా?

‘భారతీయుడు 2’ శుక్రవారం థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇలాంటి తరుణంలో మూవీ టీమ్ కు షాక్ తగిలింది. సినిమా రిలీజ్ ఆపాలంటూ రాజేంద్రన్ అనే వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. సినిమా షూటింగ్ కోసం హీరోకు తాను మర్మ కళను నేర్పించానని.. కానీ, తనకు క్రెడిట్స్ ఇవ్వలేదని పిటిషన్లో పేర్కొన్నాడు.

New Update
Bharateeyudu 2 : 'భారతీయుడు 2' పై కోర్టులో కేసు.. రిలీజ్ వాయిదా?

Case Registered Against Bharateeyudu 2 Movie : యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan) – సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘భారతీయుడు 2’ శుక్రవారం థియేటర్స్ లో విడుదల కాబోతుంది. ఇలాంటి తరుణంలో మూవీ టీమ్ కు భారీ షాక్ తగిలింది. సినిమా రిలీజ్ ఆపాలంటూ రాజేంద్రన్ అనే వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. మధురైలోని హెచ్‌ఎంఎస్ కాలనీలో ఆసన్ రాజేంద్రన్ మార్షల్ ఆర్ట్స్ టీచర్ ఈ సినిమాపై కేసు పెట్టడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కోర్టులో కేసు..

1996లో విడుదలైన కమల్ హాసన్‌ భారతీయుడు సినిమా కోసం మర్మ కళ శిక్షణ నేర్పినట్లుగా తనకు క్రెడిట్ దక్కిందని తెలిపారు. అయితే 'భారతీయుడు 2' (Bharateeyudu 2) సినిమాలో తన మెళకువలు ఉపయోగించడానికి మాత్రం మూవీ టీమ్ అతని నుండి ఎటువంటి అనుమతి తీసుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అలాగే థియేటర్లు మరియు OTT ప్లాట్‌ఫారమ్‌లలో ఈ సినిమాను నిషేధించాలని అతను కోర్టును అభ్యర్థించాడు.

Also Read : లావణ్య, రాజ్ తరుణ్ కేసులో బిగ్‌ ట్విస్ట్.. రాజ్ తరుణ్ కు పదేళ్ల జైలు శిక్ష?

రిలీజ్ వాయిదా?

కాగా దాఖలు చేసిన ఈ పిటిషన్‌ ను జూలై 9న మదురై జిల్లా కోర్టు (Madurai District Court) లో కేసు విచారణ జరిగింది.రాజేంద్రన్‌కు చేసిన ఫిర్యాదు కు రెస్పాన్స్ అవ్వడానికి 'ఇండియన్ 2'మేకర్స్ సమయం కోరడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను జూలై 11కి వాయిదా వేశారు. ఇలాంటి తరుణంలో 'భారతీయుడు 2' రిలీజ్ వాయిదా పడనుందనే అనుమానాలు ఫిలిం సర్కిల్స్ లో వ్యక్తమవుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు