Jani Master : జానీ మాస్టర్ పై కేసు నమోదు.. అసలేం జరిగిందంటే?

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. సతీష్ అనే డ్యాన్సర్ పోలీసులకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. జానీ మాస్టర్ నాలుగు నెలల నుంచి తనని షూటింగ్స్‌కి పిలవడం లేదని, తనకి వర్క్ ఇచ్చిన కో ఆర్డినేటర్స్‌ని సైతం బెదిరిస్తున్నాడని పిర్యాదులో పేర్కొన్నాడు.

New Update
Jani Master : జానీ మాస్టర్ పై కేసు నమోదు.. అసలేం జరిగిందంటే?

Case Filed On Jani Master :టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదైనట్లు తాజా సమాచారం బయటికొచ్చింది. ప్రస్తుతం జానీ మాస్టర్ తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కి అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. కాగా ఈ డ్యాన్స్‌కు సంబంధించిన గ్రూపులో సతీష్ అనే డాన్సర్ మెంబర్‌గా ఉన్నాడు.

అతను తాజాగా జానీ మాస్టర్ మీద పోలీసులకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. జానీ మాస్టర్ నాలుగు నెలల నుంచి తనని షూటింగ్స్‌కి పిలవడం లేదని, తనకి వర్క్ ఇచ్చిన కో ఆర్డినేటర్స్‌ని సైతం బెదిరిస్తున్నాడని పిర్యాదులో పేర్కొన్నాడు.జానీ మాస్టర్ తన్ని షూటింగ్స్ కి పిలకపోవడంతో తనకు ఉపాధి లేకుండా పోయిందని సతీష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Also Read : ఫస్ట్ టైమ్ అలాంటి సినిమాలో నటించనున్న మృణాల్ ఠాకూర్..సెట్ అవుతుందా?

దీంతో జానీ మాస్టర్‌పై హైదరాబాద్లోని గచ్చిబౌలి పరిధి రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. కాగా ఇప్పటి వరకు ఈ ఘటనపై జానీ మాస్టర్ స్పందించలేదు. మరోవైపు జానీ మాస్టర్ ఇటీవలే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో చేరిన సంగతి అందరికి తెలిసిందే. పార్టీ తరుఫున ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. ఇక ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో జానీ మాస్టర్‌కు ప్రభుత్వం తరుపున పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Advertisment
తాజా కథనాలు