బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్(Ranbir Kapoor) ఇటీవల విడుదలైన 'యానిమల్(Animal)' సినిమా ద్వారా విజయాన్ని అందుకున్నాడు. ఇక డిసెంబర్ 25న కుటుంబంతో కలిసి రణబీర్ క్రిస్మస్ జరుపుకోన్నారు. ఈ సందర్భంగా అలియా జంట తన కూతురు రాహా ముఖాన్ని తొలిసారిగా చూపించారు. రాహా చిత్రాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. అదే సమయంలో.. రణబీర్ కపూర్ తన క్రిస్మస్ వేడుకల వీడియోలలో ఒకదానికి సంబంధించి చిక్కుల్లో పడ్డాడు. ఈ వీడియోలో రణబీర్ చేసిన ఓ కామెంట్ అతడిని చిక్కుల్లో పడేసింది. దీంతో రణబీర్ పై పోలీసులకు ఫిర్యాదు అందింది.
ఇంతకీ ఏం జరిగిందంటే?
రణబీర్ కపూర్ క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ క్లిప్‌లో రణబీర్ 'జై మాతా ది' అని అరుస్తూ కేక్‌పై మద్యం పోసి నిప్పంటించాడు. ఈ వీడియో కొంతమందికి ఏమాత్రం నచ్చలేదు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా రణబీర్‌పై ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాడు ఈ యనిమల్ హీరో. ఈ వీడియోపై దుమారం రేగుతుండగా.. ముంబైలోని పోలీస్ స్టేషన్‌లో అతనిపై ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో ఇంకా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) నమోదు కాలేదు.
చర్యలు తీసుకోవాలని డిమాండ్:
బాంబే హైకోర్టు లాయర్లు ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రా ద్వారా సంజయ్ దీనానాథ్ తివారీ రణబీర్‌పై ఫిర్యాదు చేశారు. రణ్‌బీర్ కపూర్ 'జై మాతా ది' అని చెప్పగానే, మిగిలిన కుటుంబ సభ్యులు కూడా జై మాతా ది అని అన్నట్టు కంప్లైంట్‌లో పేర్కొన్నారు లాయర్లు. రణబీర్ కపూర్ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశాడన్నది వాళ్ల ప్రధాన ఆరోపణ. మతపరమైన మనోభావాలు దెబ్బతిశారని, హిందూవుల మనోభావాలను కించపరిచే లక్ష్యంతో ఈ వీడియోను రూపొందించి ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
Also Read: ‘నన్ను దారుణంగా ట్రోల్ చేశారు.. చాలా బాధపడ్డా..’ కేఎల్‌రాహుల్ ఎమోషనల్!
WATCH: