BRS Ex-MLA Shakil Aamir: తెలంగాణాలో అధికారం చేప్పట్టిన కాంగ్రెస్ పార్టీ అక్రమాలపై ఉక్కుపాదం మోపుతోంది. వరుసగా బీఆర్ఎస్ నేతలపై అధికారులు తనిఖీలు చేపట్టడంతో కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ దాడులు చేయిస్తుందని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ రోజు బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్, ఆయన కుటుంబ సభ్యుల రైస్ మిల్లుల్లో సోదాలు నిర్వహించారు అధికారులు.
ALSO READ: కేసీఆర్ ఫ్యామిలీ పాస్ పోర్టులు గుంజుకోండి .. బండి సంజయ్ సంచలన డిమాండ్
అధికారులు చేపట్టిన సోదాల్లో కీలక విషయాలు బయటకు వచ్చాయి. సోదాల్లో రూ.70 కోట్ల విలువైన కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) ధాన్యం పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. 33,328 టన్నుల ధాన్యానికి లెక్కలు లేవని పౌర సరఫరాల శాఖ అధికారులు నిర్దారించారు. నిజామాబాద్ జిల్లాలోని మూడు మిల్లుల్లో ఈ ధాన్యం దుర్వినియోగ మైనట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ స్టాక్ మొత్తం 2021-22 యాసంగి, 2022-23 వానాకాలం సీజన్లకు సంబంధించినదిగా గుర్తించారు. అలాగే రూ.9 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నయి. దీనిపై కేసు నమోదు చేశారు. ఇంకా తనిఖీలు చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని సివిల్ సప్లై ఆఫీసర్లు చెబుతున్నారు.
ఇటీవల బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి( Jeevan Reddy)కి ఆర్టీసీ, విద్యుత్ అధికారులు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్మూర్‌లోని ఆర్టీసీ స్థలాన్ని అద్దెకు తీసుకుని ఆ స్థలంలో షాపింగ్ మాల్‌ని జీవన్‌రెడ్డి నిర్మించాడు. అయితే షాపింగ్ మాల్ అద్దెని గత కొంత కాలంగా కట్టకుండా ఎగ్గొడుతున్నాడు. సుమారుగా 7.50 కోట్ల అద్దె బకాయిలు చెల్లించకుండా ఆర్టీసీ అధికారులను బెదిరిస్తూ వస్తున్నాడు. అలాగే తన షాపింగ్ మాల్‌కి విద్యుత్ బిల్లులు కూడా చెల్లించడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండడం, జీవన్‌రెడ్డి ఎమ్మెల్యేగా కావడంతో కొంతకాలంగా అధికారులకు పేరుకుపోయిన బకాయిలను కట్టడం లేదు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ లేకపోవడం, ఎమ్మెల్యేగా కూడా జీవన్‌రెడ్డి ఓడిపోయారు. ఈ సారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆర్టీసీ , విద్యుత్ అధికారులు రంగంలోకి దిగి జీవన్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు. అధికారులు వెంటనే రంగంలోకి దిగి షాపింగ్ మాల్‌కి విద్యుత్ సరఫరా నిలిపివేశారు.