రెచ్చిపోయిన కౌశిక్‌రెడ్డి.. సీరియస్ యాక్షన్ తీసుకున్న సీపీ.!

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్ టూటౌన్ పీఎస్ లో కేసు నమోదైంది. IPC సెక్షన్స్‌ 353, 290, 506 కింద కేసు నమోదు చేశారు. నిన్న కౌంటింగ్‌ సందర్భంగా కౌశిక్‌రెడ్డి ఆందోళన చేస్తూ పోలీసులపై తిరగబడ్డ సంగతి తెలిసిందే.

New Update
రెచ్చిపోయిన కౌశిక్‌రెడ్డి.. సీరియస్ యాక్షన్ తీసుకున్న సీపీ.!

BRS MLA Padi Kaushik Reddy: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. నిన్న కౌంటింగ్‌ సందర్భంగా కౌశిక్‌రెడ్డి తన కార్యకర్తలతో కలిసి పోలీసులపై తిరగబడిన సంగతి తెలిసిందే. దీంతో, ఆయన తీరుపై సీపీ అభిషేక్‌ మహంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం లాఠీ పట్టుకుని వారిని ఉరికించారు. కౌంటింగ్ సందర్భంగా కౌశిక్‌రెడ్డి ప్రవర్తించిన తీరుపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. కరీంనగర్‌ (Karimnagar) టూటౌన్‌లో ఆయనపై కేసు నమోదు చేశారు. IPC సెక్షన్స్‌ 353, 290, 506 కింద కేసు ఫైల్ చేశారు.

Also read: సిగ్గు – శరం..లేనోళ్లు..! మంత్రి అంబటి ఘాటు వ్యాఖ్యలు

కాగా, పాడి కౌశిక్ రెడ్డి ఎమోషనల్ ఎన్నికల ప్రచారం వర్క్ అవుట్ అయింది. మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ (Etela Rajender) పై విజయం సాధించడానికి పాడి కౌశిక్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారు. గతంలో ఎమ్మెల్సీగా ఎన్నిక అయినప్పటికీ తనకు కిక్కు రాలేదని స్పష్టం చేశారు. అయితే ఎన్నికలకు ముందు కమలాపూర్ కౌశిక్ రెడ్డి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారు. మీరు ఓటేసి దీవిస్తే నాలుగో తేదిన జైత్రయాత్ర చేస్తా.. లేదంటే మా కుటుంబ సభ్యుల శవయాత్రేనన్నారు. చంపుకుంటారా? సాదుకుంటారా? కుటుంబ సభ్యులం ముగ్గురం ఆత్మహత్య చేసుకుంటామని కౌశిక్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మరోవైపు కౌశిక్ రెడ్డి శాలిని కూతురు శ్రీనిక చేసిన ప్రచారాలు కూడా ఫలించాయి. దీంతో తన చిరకాల కోరిక ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు కౌశిక్ రెడ్డి.

Advertisment
తాజా కథనాలు