Carrots: జుట్టు రాలడాన్ని తగ్గించే క్యారెట్లు..చుండ్రు కూడా ఉండదు

ప్రస్తుత కాలంలో అధిక జుట్టు రాలడం, చుండ్రు కారణంగా ఇబ్బంది పడుతుంటారు. క్యారెట్లను ఉపయోగించడం ద్వారా జుట్టును సులభంగా బలోపేతం అవ్వటంతోపాటు జుట్టును అందంగా మార్చుకోవచ్చని నిపుణులు అంటున్నారు. క్యారెట్‌తో హోం రెమెడీ తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

Carrots: జుట్టు రాలడాన్ని తగ్గించే క్యారెట్లు..చుండ్రు కూడా ఉండదు
New Update

Carrots: అందమైన జుట్టు అంటే అందరికీ ఇష్టంగానే ఉంటుంది. కానీ కొందరు అధిక జుట్టు రాలడం, చుండ్రు కారణంగా ఇబ్బంది పడుతుంటారు. దీనికోసం జుట్టుకు అనేక రకాల షాంపూలు, నూనెలను వాడుతుంటారు. అయితే.. హోం రెమెడీ ద్వారా జుట్టును అందంగా మార్చుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అందులో క్యారెట్ ఒకటి. క్యారెట్లను ఉపయోగించడం ద్వారా జుట్టును సులభంగా బలోపేతం అవుతుంది. ప్రతి ఇంట్లో క్యారెట్‌ ఉంటుంది. దాని ప్రయోజనాలు చాలా మంది తెలియదు. క్యారెట్‌ను ఉపయోగించడం ద్వారా జుట్టును పొడవుగా, మందంగా, మెరిసేలా చేసుకోవచ్చు. జుట్టు రాలడం, చుండ్రు నుంచి ఉపశమనం కావాలంటే ఇలా క్యారెట్ ఉపయోగించాలో..? జుట్టు సంరక్షణ చిట్కాలు ఉన్నాయి. జట్టుకు క్యారెట్‌ వలన ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

publive-image

క్యారెట్ రుచికరమైనది మాత్రమే కాదు.. జుట్టుకు కూడా చాలా ఉపయోగకరంగా పని చేస్తుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో క్యారెట్లు ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇందులో విటమిన్లు, కెరోటిన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది జుట్టును బలంగా, మందంగా, మెరిసేలా చేస్తుంది. అంతేకాదు క్యారెట్‌ చుండ్రును సులభంగా తగ్గించవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది స్కాల్ప్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

publive-image

క్యారెట్లను అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. ముందుగా క్యారెట్ జ్యూస్ తయారు చేసి తలకు పట్టించి 20 నిమిషాల పాటు తర్వాత షాంపూతో జుట్టును కడగాలి. అంతేకాకుండా క్యారెట్ నూనెను తయారు చేసుకోవచ్చు. ముందుగా రెండు మూడు క్యారెట్లను మెత్తగా రుబ్బి, దానికి కొబ్బరినూనె వేసి తక్కువ మంట మీద వేడి చేయాలి. ఈ నూనెను వడపోసి చల్లార్చి తలకు 25 నిమిషాల పాటు అప్లై చేయాలి. తర్వాత షాంపూతో తలను కడగాలి.

publive-image

క్యారెట్ హెయిర్ మాస్క్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఒక క్యారెట్‌ను గ్రైండ్ చేసి అందులో ఒక చెంచా పెరుగు, కొంచం తేనె మిక్స్ చేసి ఈ పేస్ట్‌ను జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత షాంపూతో జుట్టును కడగాలి. ఈ అన్ని పద్ధతులతో జుట్టును బలోపేతం చేయవచ్చు, జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు. ఇలా చేయడం వలన చుండ్రు, స్కాల్ప్ సమస్యలను తొలగి.. జుట్టును మందంగా, బలంగా మార్చుతుంది.

ఇది కూడా చదవండి: చెవిలో గులిమి 2 నిమిషాల్లో బయటికి వచ్చే చిట్కాలు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#dandruff #hair-fall #carrots
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe